జగిత్యాల జిల్లాలో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.రాయికల్ మండలం వస్తాపూర్లో చిరుత సంచరిస్తోంది.
ఈ క్రమంలోనే వస్తాపూర్లో మేకల మందపై దాడి చేసిన చిరుత పులి మేకలను చంపేసింది.దీంతో స్థానిక గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను సేకరించే పనిలో పడ్డారు.చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.