Ram Charan, Jr. NTR : మూడేళ్లకో సినిమా చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ హీరోలు.. ఇలా చేస్తే మాత్రం కెరీర్ కు ఇబ్బందేనంటూ?

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు నెలకు ఒక సినిమాను పూర్తి చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి.అయితే ఇప్పుడు ఒక్కో సినిమాకు హీరోలు రెండు నుంచి మూడేళ్ల సమయం తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి.

 Charan Junior Ntr Worst Planning About Movie Career Details Here Goes Viral In-TeluguStop.com

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్( Ram Charan, Jr.NTR ) ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడేళ్ల సమయం తీసుకోవడంపై నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆర్.ఆర్.ఆర్, ఆచార్య( Acharya ) తర్వాత చరణ్ నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.

ఆర్.

ఆర్.ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి కూడా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.దేవర సినిమా( Devara movie ) దసరాకు రిలీజ్ కావాల్సి ఉన్నా ఆ తేదీకి కూడా కచ్చితంగా రిలీజ్ అవుతుందని గ్యారంటీగా చెప్పలేము.ఆర్.ఆర్.ఆర్ హీరోలు మూడేళ్లకు ఒక సినిమా చేస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి రెమ్యునరేషన్లు, క్రేజ్ సమానంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.

Telugu Acharya, Devara, Jr Ntr, Career, Rajamouli, Ram Charan, Tollywood-Movie

చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకే సమయంలో మూడు సినిమాల్లో నటిస్తే మాత్రమే ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంటుంది.చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఆర్.ఆర్.ఆర్2 మూవీ తెరకెక్కిస్తానని రాజమౌళి ( Rajamouli )చెబుతుండగా రాజమౌళి ఈ కాంబినేషన్ లో సినిమాను ప్లాన్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు.

Telugu Acharya, Devara, Jr Ntr, Career, Rajamouli, Ram Charan, Tollywood-Movie

ఆర్.ఆర్.ఆర్ మూవీ తర్వాత కూడా చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య స్నేహం మాత్రం అలాగే కొనసాగుతోందని సమాచారం అందుతోంది.బాలీవుడ్ డైరెక్టర్లు సైతం టాలీవుడ్ హీరోలపై ఫోకస్ పెడుతూ సత్తా చాటుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్, చరణ్ సినిమాలకు బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది.జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నిదానంగా సినిమాలు చేస్తే మాత్రం వాళ్ల కెరీర్ కు ఇబ్బందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube