తణుకు “ప్రజాగళం” సభ( Tanuku Praja Galam Public Meeting )లో పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు.పవన్ ఒక సినిమా హీరో మాత్రమే కాదు కోట్ల రూపాయల ఆదాయాన్ని సుఖవంతమైన సినీ జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడిన రియల్ హీరో అని కొనియాడారు.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై వైసీపీ నాయకులు వ్యక్తిగత దాడులు చేసే ఆయన అనేక అవమానాలను దాడులను తట్టుకొని నిలబడిన పోరాట యోధుడు.నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేశ రద్దుగా వచ్చి నా కోసం పని చేసిన వ్యక్తి.
నేను గాని తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) గాని ఈ విషయం ఎప్పటికీ మర్చిపోము అని చంద్రబాబు( Chandrababu Naidu ) వ్యాఖ్యానించారు.చీకటి పాలనను అంతం చేసే క్రమంలో ఓటు చీలనివ్వను అని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్.
మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం.అలాంటి సంకల్పానికి నరేంద్ర మోడీ( PM Narendra Modi ) నుంచి మద్దతు లభిస్తుంది.2014 ఎన్నికలలో పశ్చిమగోదావరి జిల్లాలో 15కి 15 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది.ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలో కలిసి పోటీ చేస్తున్నాయి… వైసీపీకి( YCP ) డిపాజిట్లు వస్తాయా.? ఈరోజు యువత పవర్ చూశాను.యువత గాని కన్నెర్ర చేస్తే.
ఈ జగన్ లండన్ పారిపోతాడు.చేతిలో ఛీప్ప పట్టుకోవడం ఖాయం… ఎక్కడికి వెళతాడో నేను ఇప్పుడే చెప్పను.నేను పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తాం.2014-19 మధ్య ఎలాంటి పాలన జరిగిందో మీకు తెలుసు.మళ్లీ అలాంటి పాలన రావాలంటే కూటమి రావాలి.జాబు రావాలంటే కూటమి రావాలి.రాష్ట్ర ప్రయోజనాలే మాకు ప్రధమ ప్రాధాన్యత అని చంద్రబాబు సంచలన స్పీచ్ ఇచ్చారు.