కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై పుట్టిన తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూనే వచ్చింది.కాంగ్రెస్ విధానాలపై టీడీపీ , టీడీపీ విధానాలపై కాంగ్రెస్ తరుచు దుమ్మెత్తిపోసుకుంటూనే వచ్చాయి.
అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ తో టీడీపీ పెట్టుకోవడం… మెజార్టీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం .చంద్రబాబు తీరుపై సామాన్య కార్యకర్తల్లోసైతం అనేక అనుమానాలు కలగడంతో అయన ఇప్పుడు నష్టనివారణ చర్యలకు దిగాడు.అసలు చంద్రబాబు తాను తీసుకున్న నిర్ణయాన్ని చివరి వరకూ ముఖ్య నేతలకు కూడా చెప్పలేదు.
ఢిల్లీ స్థాయిలో అపాయింట్ మెంట్ ఫిక్స్ చేసే నేతలకు, సీనియర్ నేతలకు తప్ప కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా రాహుల్ తో భేటీ విషయం తెలియదు.

విపక్షాలు ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారంటూ విమర్శలు చేస్తుండటం, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని ఇప్పటికీ ఆ పార్టీ క్యాడర్ నమ్ముతుండటంతో … తాను జాతీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ తో జట్టుకట్టానని, అందులో రాష్ట్ర ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.దీంతోపాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ తనకు స్వయంగా చెప్పడాన్ని కూడా టెలికాన్ఫరెన్స్ లో వివరంగా చంద్రబాబు చెప్పారు.అయితే… బాబు చెప్పిన మాటలకు పై స్థాయి నాయకులు అర్ధం చేసుకున్నా… కిందిస్థాయిలో మాత్రం బాబుని నమ్మడం లేదు.

అందుకే వారిని నమ్మించి బాబు ఏది చేసినా, పార్టీ కోసం… రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్నట్టుగా నమ్మించేందుకు… కాంగ్రెస్ తో ఎందుకు జత కట్టాల్సి వచ్చింది అనే విషయం పూర్తిస్థాయిలో తెలిపాలని డిసైడ్ అయ్యారు.దీనికోసం పెద్దఎత్తున కరపత్రాలను సిద్ధం చేస్తున్నారు.అసలు ఎందుకు కలవాల్సి వచ్చింది? ఎన్టీఆర్ ఆశయాలు ఏంటి? సిద్ధాంతాలు ఏంటి? అనే విషయాలను కరపత్రాల ద్వారా తెలియజెప్పి క్యాడర్ లో ఉన్న అయోమయాన్ని పొగొట్టాలని బాబు భావిస్తున్నారు.
కరపత్రాలతో పాటుగా చంద్రబాబు ఇకపై మంగళ, బుధవారాలు పార్టీ కోసం కేటాయించాలని నిర్ణయించారు.
అయితే బాబు చెబుతున్న కారణాలను కిందిస్థాయిలో ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తేలాల్సి ఉంది.