KCR Elections Campaign : నేటి నుంచే కేసీఆర్ ఎన్నికల ప్రచారం.. సెంటిమెంట్ రాజేస్తారా ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్.( KCR ) ఇక పూర్తిగా లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని ప్రజల్లో బీఆర్ఎస్( BRS ) ప్రభావం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం మొదలు పెట్టనున్నారు.

 Brs Party Chief Kcr Loksabha Elections Campaign Meeting At Karimnagar-TeluguStop.com

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గర నుంచి కేసీఆర్ పెద్దగా జనాల్లోకి రావడం లేదు.మరోవైపు చూస్తే కాంగ్రెస్, బిజెపిలు లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) సత్తా చాటుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తూ, బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే నేటి నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు.ఇప్పటి వరకు నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థుల ఎంపికపై నేతలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించిన కేసీఆర్, నేటి నుంచి ప్రజల్లోకి వెళ్లి బీఆర్ఎస్ ప్రభావం పెరిగే విధంగా ప్రయత్నించబోతున్నారు.

Telugu Brs, Congress, Karimnagar, Kcr, Koppula Eshwar, Loksabha, Telangana, Vino

ఈ మేరకు ఈరోజు సాయంత్రం కరీంనగర్ లోని ( Karimnagar ) ఎస్ ఆర్ ఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది.ఈ సభకు కనీసం లక్ష మందిని అయినా సమీకరించాలని ఇప్పటికే పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ ,( Vinod Kumar ) పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar ) పేర్లను కేసీఆర్ ఫైనల్ చేశారు.బీఆర్ఎస్ కు మొదటి నుంచి గట్టి పట్టున్న కరీంనగర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.

అందుకే ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో తొలి సభను కరీంనగర్ నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.ఈ సభను విజయవంతం చేసే పనిని పార్టీ సీనియర్ నేతలకు కేసీఆర్ అప్పగించారు.

Telugu Brs, Congress, Karimnagar, Kcr, Koppula Eshwar, Loksabha, Telangana, Vino

ఇక కరీంనగర్ సభలో కెసిఆర్ ఏ విధంగా ప్రసంగం చేస్తారు ? ప్రత్యర్థులపై ఏ విధంగా విమర్శలతో విరుచుకుపడతారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తరువాత నల్గొండలో జరిగిన సభలో కేసీఆర్ పాల్గొన్న, కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయలేదు.అయితే ఈ సభలో కాంగ్రెస్, బిజెపిలపై తీవ్రస్థాయి విమర్శలు చేయడంతో పాటు, ప్రజల్లో సెంటిమెంటును రగల్చి బీఆర్ఎస్ కు మెజార్టీ స్థానాలు దక్కే విధంగా కేసీఆర్ తన ప్రసంగాన్ని వినిపించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube