తెలుగు రాష్ట్రాలకు నూతన గవర్నర్ లను నియమించే పనిలో పడింది కేంద్రం.ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలు రెండిటికి కలిపి ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఇరు రాష్ట్రాలకు వేరు వేరుగా గవర్నర్లను నియమించాలి కేంద్ర హోం శాఖ వర్గాలు చర్చలు జరుపుతున్నాయి.పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే విజయవాడ లో ఇదివరకు ముఖ్యమంత్రి ఆఫీస్ గా ఉన్న కార్యాలయాన్ని గవర్నర్ కార్యాలయమా తీర్చిదిద్దే పనులు జరుగుతుండడం తో త్వరలో అక్కడ నూతన గవర్నర్ కొలువుతీరే అవకాశం కనిపిస్తుంది.విభజన చట్టం ప్రకారం పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇన్నాళ్లు గా తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ ను కొనసాగిస్తూ వస్తున్నారు.

2009 నుంచి గవర్నర్ గా నరసింహన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఇరు రాష్ట్రాలు కూడా పూర్తిగా వాటి భూభాగాల నుంచి పరిపాలన సాగిస్తుండటం, అలానే హైకోర్టు కూడా వేరు వేరు గా ఏర్పరచుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో గవర్నర్లను కూడా వేరు వేరుగా నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి కేంద్రం వచ్చినట్లు తెలుస్తుంది.అయితే కొత్త గవర్నర్ నియామకం పై ఇప్పటికే ఏపీ సీఎం జగన్ కు సమాచారం అందింది అని, పార్లమెంట్ సమావేశాల అనంతరం నూతన గవర్నర్ ఎవ్వరు అన్న విషయాన్నీ కేంద్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.