బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా నటీనటులు దర్శకుడు ఎంతగా గుర్తింపు తెచ్చుకున్నారో అదే రేంజ్ లో రైటర్ కి కూడా క్రేజ్ దక్కింది.అయితే పబ్లిక్ లో కాకుండా సినీ ప్రముఖులను కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఎక్కువగా ఆకర్షించాడు.
కథల కొరత ఏర్పడుతున్న అంధకార సమయంలో స్టార్ హీరోలందరికీ ఆయనే వెలుగులా కనిపిస్తున్నారు.
ముఖ్యంగా బాలీవుడ్ లో ఖాన్ త్రయం బాహుబలి రైటర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
సల్మాన్ ఖాన్ కు ఇదివరకే భజరంగి భాయీజాన్ సినిమా కథను అందించి బాలీవుడ్ కింగ్ గా నిలబెట్టాడు.అలాగే మరో కథ ఉంటె సెట్ చేయమని గత కొంత కాలంగా సల్మాన్ ఈ రైటర్ వెంటపడుతున్నాడు.
ఇక మరో ఖాన్ షారుక్ కూడా విజయేంద్ర ప్రసాద్ ను రెండు సార్లు ప్రత్యేకంగా కలుసుకున్నాడు.కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా వరుస ప్లాప్స్ ఎదురవుతుండడంతో ఎలాగైనా నెక్స్ట్ సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఈ క్రమంలో అట్లీతో మాట్లాడి విజయేంద్రప్రసాద్ తో కథను రాయిస్తున్నాడు.

అదే విధంగా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ఈ స్టార్ రైటర్ తో ఒక్క సినిమా అయినా చేయాలనీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.తనకు సెట్టయ్యే ప్రయోగాత్మకమైన కథను రాయమని పలుమార్లు ప్రస్తావించాడు.కథ ఎలా ఉన్నా అలోచించి తప్పకుండా ఎదో ఒక నిర్ణయం తీసుకుంటాను అని తనను దృష్టిలో ఉంచుకొని డిఫరెంట్ కథను రాయమని చెప్పినట్లు తెలుస్తోంది.
వీరితో పాటు చాలా మంది బాలీవుడ్ దర్శకులు దర్శకులు విజయేంద్ర ప్రసాద్ ను కథ రాసిపెట్టామని అడుగుతున్నారు.అయితే విజయేంద్ర ప్రసాద్ కూడా ఎవరిని నొప్పించకుండా అందరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.
ఇప్పటికే సల్మాన్ కోసం ఒక కథను సెట్ చేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ తమిళ్ లో జయలలిత బయోపిక్ కోసం స్క్రిప్ట్ ను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారు
.






