భారత్‌తో సంబంధాల వృద్ధి.. కొత్త ఏడాదిలో నాలుగు లక్ష్యాలు పెట్టుకున్న కెనడా ..!!

భారతదేశంతో తన సంబంధాలకు సంబంధించి కెనడా నాలుగు తీర్మానాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నట్లు ఇండియాలో ఆ దేశ డిప్యూటీ హైకమీషనర్ అమండా స్ట్రోహాన్ తెలిపారు.జీ20కి భారత్ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో దీనికి మద్ధతు తెలపడం దీనిలో మొదటిది.దీనికి సంబంధించి గత వారం కెనడా , భారత్ విదేశాంగ మంత్రులు మెలానీ జోలీ, ఎస్ జైంకర్ మధ్య చర్చల వివరాలను స్ట్రోహాన్ ప్రస్తావించారు.రెండవది ఇండో పసిఫిక్ వ్యూహంలో భారత్‌కు ప్రాధాన్యత ఇవ్వడం.

 Canada’s Four Priorities To Boost Ties With India In New Year, Canada India Ea-TeluguStop.com

ఈ వ్యూహం ఐదు పరస్పర అనుసంధాన వ్యూహాత్మక లక్ష్యాలను కలిగి వుంది.పర్యావరణం, సరఫరా గొలుసులు, వ్యక్తులతో పరిచయాలు, వాణిజ్యం, శాంతి ఇందులో ప్రధానమైనవి.

మూడవది సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందానికంటే ముందుగా కెనడా ఇండియా ఎర్లీ ప్రోగ్రెస్ ట్రేడ్ అగ్రిమెంట్‌ (ఈపీటీఏ) చర్చల్లో పురోగతి సాధించడమని స్ట్రోహాన్ చెప్పారు.నాల్గవది ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం.ఆ దేశ జనాభాలో 3 శాతం (12 లక్షల మంది) భారత మూలాలున్న వ్యక్తులు వున్నారు.

కాగా… భారత్ తో కెనడా వ్యూహాత్మక సంబంధాలను మరింతగా పెంచుకోవాలని.లేని పక్షంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో పుట్టిన ప్రజాస్వామ్య వేదిక (క్వాడ్) నుంచి అది మినహాయించబడే ప్రమాదం వుందని నిపుణులు అంటున్నారు.ఈ మేరకు ఈ ఏడాది జూలైలో కెనడియన్ దినపత్రిక నేషనల్ పోస్ట్ లో ఓ కథనం ప్రచురితమైంది.

భారత్ తో భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడంలో కెనడా ఇప్పటికే దాని సన్నిహిత మిత్రదేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా కంటే వెనుకబడి వుంది.

Telugu America, Australia, Canadaindia, Canadasboost, Indo Pacific, Strohan, Tan

ఇండో పసిఫిక్ ప్రాంత ప్రాముఖ్యత పెరుగుతున్నందున, సురక్షితమైన, సంపన్నమైన ప్రపంచం కోసం భారతదేశంతో కలిసి ఒక ప్రముఖ పాత్రను పోషించాలని కెనడా ఆసక్తిగా వుందని ఒట్టావా కేంద్రంగా పనిచేస్తున్న థింక్ ట్యాంక్ మెక్‌డొనాల్డ్ లారియర్ ఇన్‌స్టిట్యూట్ (ఎంఎల్ఊ) అభిప్రాయపడింది.అయితే నవంబర్ 2019 నుంచి కెనడా సరికొత్త ఇండో పసిఫిక్ వ్యూహంపై పనిచేస్తూ వస్తోంది.ఈ విధానాన్ని అభివృద్ధి చేయడానికి కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖ, గ్లోబల్ అఫైర్స్ కెనడా ద్వారా ప్రత్యేక సెక్రటేరియట్ ను ఏర్పాటు చేశారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube