అమెరికాలో ప్రస్తుతం హెచ్ 1 బీ వీసాపై( H-1B Visa ) వున్న నిపుణులకు తమ దేశంలో వర్క్ పర్మిట్ ఇస్తామంటూ ఇటీవల కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనకు మంచి స్పందన వచ్చింది.తొలి రోజులోనే ఈ పథకం దాని లక్ష్యాన్ని చేరుకుంది.
హెచ్ 1 బీ వీసాదారుల కోసం కొత్త వర్క్ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 16 నుంచి కెనడా( Canada ) అనుమతించింది.ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్సీసీ) దీనిపై తాజాగా ప్రకటన చేసింది.
ప్రస్తుతం సరిపడినన్ని దరఖాస్తులు రావడంతో ఈ స్కీమ్‌ను మూసివేస్తునట్లు తెలిపింది.జూలై 17న ఈ కొత్త స్కీమ్ కోసం 10,000 దరఖాస్తుల పరిమితిని చేరుకున్నామని ఐఆర్సీసీ వెల్లడించింది.
ఈ కారణం చేత అదనపు దరఖాస్తులేవి అంగీకరించబడవని పోర్టల్ తెలిపింది.
కెనడా ప్రభుత్వం గత నెలలో ఈ పథకాన్ని ప్రకటించింది.వివిధ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో ప్రపంచ అగ్రగామిగా ఎదగాలని ఈ దేశం ఆశిస్తోంది.అలాగే అమెరికన్ టెక్ కంపెనీలలో ఉద్యోగాలు కోల్పోతున్న నిపుణులను ఆకర్షించాలని కెనడా భావిస్తోంది.
ఈ కార్యక్రమం కింద హెచ్1బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు స్టడీ, వర్క్ పర్మిట్లను కూడా అందిస్తుంది.కొత్త ప్రోగ్రామ్ కింద ఆమోదం పొందిన దరఖాస్తుదారులు మూడేళ్ల ఓపెన్ వర్క్ పర్మిట్‌ను( Open Work Permit ) అందుకుంటారు.
దీని ద్వారా కెనడాలో ఎక్కడైనా వారు పనిచేసుకోవచ్చు.వారి జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడినవారు కూడా తాత్కాలిక నివాస వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
సాధారణంగా అమెరికాలో( America ) హెచ్ 1 బీ వీసాపై ఉద్యోగం సంపాదించిన వారు తమపై ఆధారపడిన వారిని డిపెండెంట్ వీసాపై యూఎస్ తీసుకెళ్లవచ్చు.అయితే డిపెండెంట్ వీసాపై అమెరికాలో అడుగుపెట్టిన హెచ్ 1 బీ వీసాదారుల కుటుంబ సభ్యులు చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా ప్రత్యక అనుమతులు పొందాల్సి వుంటుంది.అయితే హెచ్ 1 బీ వీసాదారులను కూడా 60 రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధన భయపెడుతోంది.హెచ్ 1 బీ వీసాదారులు ఒకవేళ ఉద్యోగాన్ని కోల్పోతే.60 రోజుల లోపు కొత్త ఉద్యోగాన్ని సంపాదించాలి.లేని పక్షంలో వారు అమెరికాలో వుండటానికి అనర్హులు.
గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడంతో అమెరికాలో భారతీయులతో సహా నైపుణ్యం కలిగిన వేలాది మంది విదేశీ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు.అమెరికన్ మీడియా నివేదికల ప్రకారం.
గతేడాది నవంబర్ నుంచి దాదాపు 2,00,000 మంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.