డబుల్ బెడ్ రూం ఇళ్లపై బీజేపీ రాద్ధాంతం చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం ఇచ్చిందేమీ లేదన్నారు.
అన్ని హంగులతో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.పేదవాడు గొప్పగా బతకాలనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని పేర్కొన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వస్తే స్వయంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూపిస్తానని తెలిపారు.కిషన్ రెడ్డి తన స్థాయికి తగ్గట్లుగా వ్యవహరించడం లేదని పేర్కొన్నారు.
కిషన్ రెడ్డి కేంద్రం నుంచి తెచ్చిందేమీ లేదని వెల్లడించారు.బీజేపీ నేతలు పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.