భారతదేశంలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న పండ్ల తోటలలో జామ పంట( Guava cultivation ) కూడా ఒకటి.అయితే జామ పంట సాగు చేయాలంటే కచ్చితంగా పూర్తి అవగాహన ఉండాలి.
ఎందుకంటే జామ పంటకు తెగుళ్ల బెడద చాలా ఎక్కువ.జామకాయలు పక్వానికి వచ్చే దశలో వివిధ రకాల తెగుళ్ల ఉధృతి స్పష్టంగా గుర్తించవచ్చు.
జామ పంట సాగును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి.ఏవైనా జామ పండ్లకు తెగుళ్లు కనిపిస్తే కాయలను తోట నుండి వేరు చేయాలి.
నీటి తడులు సాధారణ పద్ధతిలో కాకుండా డ్రిప్ విధానం ద్వారా అందించాలి.జామ కాయలు పిందె దశలో ఉన్నప్పుడు మిథైల్ యూజినాల్ ఎరలను 6-8 చొప్పున ఎకరం పొలానికి అమర్చాలి.
వీటిని పంట కాలంలో నెలకు ఒకసారి మారిస్తే తెగుళ్ల బెడద అరికట్టబడుతుంది.
దీన్ని రైతులు( Farmers ) స్వయంగానే ఎలా తయారు చేసుకోవాలంటే.? మిథైల్ యూజినాల్ 2మి.లీ + మలాథియాన్ 2మి.లీ ను ఒక లీటరు నీటిలో కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి.ఈ ద్రావణంలో ఫ్లైవుడ్ మొక్కలను నానబెట్టి ప్లాస్టిక్ సీసాలో పెట్టి తోటల్లో అక్కడ అమర్చాలి.
దీంతో పండు ఈగల ఉధృతి తగ్గుతుంది.కాస్త సులభ మార్గంలో ఈ పండు ఈగల బెడతను తగ్గించాలంటే ఒక లీటర్ నీటిలో 100 గ్రాముల బెల్లం లేదంటే పులిసిన గంజి ను మలాథియాన్ 5మి.లీ కలిపి మట్టి పాత్రలలో పోసి తోటలలో అక్కడక్కడా అమర్చితే ఈగల తీవ్రత తగ్గుతుంది.
ఇక జామ పంటలకు తెల్ల సుడి దోమల బెడద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.జామ ఆకులపై తెల్లని దూది వంటి మెత్తని పదార్థం ఉండి, ఆకులోని రసాన్ని పీల్చడం వల్ల ఎర్రబడి ఆకులు ముడతలు పడితే వాటిని తెల్లసుడి దోమలు ఆశించినట్లు నిర్ధారించుకోవాలి.ఈ దోమల నివారణకు జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను రాత్రి సమయాలలో వీటి ఉధృతి ఎక్కువగా ఉండే చెట్ల దగ్గర పెట్టాలి.
అప్పుడు తెల్ల సుడిదోమల బెడద తగ్గుతుంది.