నేడు తెలంగాణ క్యాబినెట్( Telangana Cabinet ) సమావేశం కాబోతోంది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు , అనేక కీలక అంశాల పైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయం లో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగునుంది. ఈ సమావేశంలోనే అనే కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.
ముఖ్యంగా హైడ్రాకు మరిన్ని బాధ్యతలు అప్పగించే విషయం పైన ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపైన నిర్ణయం తీసుకోనున్నారు.
ఇక మూసి నది ప్రక్షాళన పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.ఎప్పటికే సీయోల్ కు కొంతమంది మంత్రుల బృందం వెళ్ళింది.
![Telugu Cm Revanth, Congress, Telangana, Telanganacm-Politics Telugu Cm Revanth, Congress, Telangana, Telanganacm-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/10/Telangana-government-Telangana-CM-revanth-Reddy-Telangana-cabinet-Telangana-cabinet-cm-Revanth-congress.jpg)
అక్కడ ప్రాజెక్టును అధ్యయనం చేస్తున్నారు.వారు ఇచ్చే నివేదిక పై మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.మూసీ నది నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు, పెద్ద భవనాలను కూల్చివేస్తే వాటి స్థానంలో 200 గజాల స్థలాన్ని ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది .ఈ విషయం పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇళ్లు కోల్పోయిన ప్రాంతానికి దగ్గరలోనే బాధితులకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అప్పుడే వారు సెంటిమెంట్ ఫీల్ అవ్వరని అంచనా వేస్తున్నారు.దీనిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
ఇప్పటికే అధ్యయనం చేసిన మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఇచ్చే అవకాశం ఉంది .ఎవరెవరికి రేషన్ కార్డులు ఇవ్వవచ్చు, ఎంతవరకు ఇవ్వవచ్చు అనేదానిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించుకున్నారు.
![Telugu Cm Revanth, Congress, Telangana, Telanganacm-Politics Telugu Cm Revanth, Congress, Telangana, Telanganacm-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/10/government-Telangana-CM-revanth-Reddy-Telangana-cabinet-Telangana-cabinet-meeting-cm-Revanth-congress.jpg)
కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తే సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాల్సి ఉంటుందని , అందుకే తెలుపు రంగు రేషన్ కార్డులకు సంబంధించి విధివిధానాలపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.రైతుబంధు పథకం పైన మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతుండడంతో దీనిపైన చర్చించనున్నారు.ఇలా అనేక కీలక అంశాలకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.