సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘గుంటూరు కారం‘ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పటికీ కేవలం రెండు షెడ్యూల్స్ ని మాత్రమే పూర్తి చేసుకున్న ఈ సినిమా కి సంబంధించి రీసెంట్ గానే ఒక టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కృష్ణ పుట్టినరోజు ని పురస్కరించుకొని విడుదల చేసిన ఈ టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.నోట్లో బీడీ పెట్టుకొని ఊర మాస్ అవతారం లో మహేష్ బాబు చూపించిన స్వాగ్ కి అందరూ ఫిదా అయిపోయారు.
మహేష్ ని ఎవ్వరూ ఊహించని రీతిలో చూపించి సర్ప్రైజ్ చెయ్యడం త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్. మహేష్ కెరీర్ ని ఒక్కసారి చూస్తే ‘ఖలేజా’ కి ముందు, ‘ఖలేజా’ కి తర్వాత అని చెప్పొచ్చు.
ఖలేజా( Khaleja ) సినిమాలో అంతకు ముందు మనం ఎప్పుడూ చూడని మహేష్ ని చూపించాడు త్రివిక్రమ్, అప్పటి నుండి ఆడియన్స్ ఖలేజా మహేష్ బాబు ని ఎక్కువగా ఇష్టపడుతూ వచ్చారు.

ఇప్పుడు కూడా మహేష్ లోని సరికొత్త ఊర మాస్ యాంగిల్ ని చూపించాడు త్రివిక్రమ్( Trivikram ), ఈ సినిమా తర్వాత ఇదే మహేష్ కావాలని కోరుకుంటారు అంటూ మూవీ టీం కాన్ఫిడెంట్ గా చెప్తుంది.ఇదంతా పక్కన పెడితే ఈ టీజర్ లో మహేష్ బాబు వేసుకున్న షర్ట్ అభిమానులను ఎంతగానో ఆకర్షించింది.తమ అభిమాన హీరో ధరించిన దుస్తులను కొనుక్కోవడానికి ఎగబడే అభిమానులు ఉండగా, ఈ కామర్స్ సైట్స్ ఎందుకు గమ్ముగా ఉంటాయి?, అందుకే ఈ షర్ట్ లో ఆన్లైన్ సేల్స్ కి పెట్టారు. ఒక్కో షర్ట్ ధర 3 వేల రూపాయిలు ఉంటుంది.ఎరుపు రంగులో , నల్లని గీతలు ఉన్న ఈ చొక్కా ని ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అట.వెంటనే ఫ్లిప్ కార్ట్ లో ఈ షర్ట్ ని ఆర్డర్ పెట్టేసుకోండి.కేవలం రెండు మూడు రోజుల్లోనే ఈ షర్ట్స్ మీద డెలివరీ అయిపోతాయి.

ఇక ఈ ‘గుంటూరు కారం’( Guntur Kaaram ) చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల చేయబోతున్నామని మూవీ టీం అధికారికంగా ప్రకటించి చాలా కాలమే అయ్యింది.కానీ మహేష్ బాబు ఇస్తున్న బ్రేకులు చూస్తుంటే ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందో లేదో అనే భయం ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ నెల లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది అన్నారు కానీ, ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే దానిపై అసలు క్లారిటీ లేదు.చాలా రోజులు షూటింగ్ జరిగినట్టు మనకి అనిపించింది.
కానీ ఇన్ని రోజులు ఆ మొన్న విడుదల చేసిన టీజర్ కి సంబంధించిన సన్నివేశాన్ని మాత్రమే చిత్రీకరించారని విషయం ఎవరికైనా తెలుసా.?, కానీ అదే నిజం.ఇదే స్పీడ్ తో ముందుకి పోతే సంక్రాంతి సీజన్ మిస్ అవ్వడం ఖాయం అని అంటున్నారు ఫ్యాన్స్.