నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని పింకీ పాత్రలో ప్రముఖ నటి సుదీప ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.నువ్వు నాకు నచ్చావ్ సినిమాను చూసిన ప్రేక్షకులు సుదీప నటనను సులువుగా మరిచిపోలేరు.
ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన బిగ్ బాస్ ప్రోమో తాజాగా విడుదల కాగా ప్రోమో ఎమోషనల్ గా సాగింది.బిగ్ బాస్ షోలో సుదీప తాను నిజ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొచ్చారు.
2015 సంవత్సరంలో నేను గర్భవతిని అయ్యానని ఆ సమయంలో శరీరంలో థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ కావడం వల్ల నేను బేబీని పోగొట్టుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.సుదీప వెల్లడించిన విషయం గురించి తెలిసి బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.
మా చెల్లి కూతురు వచ్చే వరకు నా జీవితంలో ఈ బాధ కొనసాగిందని ఆమె తెలిపారు.నా భర్త ఆ పాప వాళ్ల పాప అని వాళ్లకు ఇచ్చేయాలి అని చెబుతూ ఉంటాడని సుదీప చెప్పుకొచ్చారు.
బొమ్మను ఇస్తేనే మనది అనుకున్నామే నా చెల్లి బిడ్డను తిరిగి ఇచ్చేస్తుంటే నా ప్రాణం పోయినట్టుగా అనిపించిందని సుదీప కామెంట్లు చేశారు.

సుదీప వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మిగతా కంటెస్టెంట్లు కూడా నిజ జీవితంలో తమకు ఎదురైన ఈ తరహా అనుభవాల గురించి పంచుకుంటున్నారు.మరోవైపు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ కంటెస్టెంట్ల కన్నీటి కథల గురించి తెలిసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఎప్పుడూ సంతోషంగా కనిపించే సెలబ్రిటీల జీవితాలలో ఇంతటి విషాదాలు ఉన్నాయా అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఈరోజు, రేపు ప్రసారమవుతున్న బిగ్ బాస్ ఎపిసోడ్లు ప్రేక్షకులకు సైతం కంటతడి పెట్టించేలా ఉండనున్నాయని తెలుస్తోంది.