ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది బేబమ్మ అలియాస్ కృతి శెట్టి.మొదటి సినిమానే భారీ హిట్ అవ్వడంతో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి.
దీంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.టైర్ 2 హీరోలందరికి ఈమెనే ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది.
ఉప్పెన తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు రెండు కూడా సక్సెస్ సాధించడంతో మరికొన్ని అవకాశాలు అమ్మడిని వరించాయి.ఈ రెండు సినిమాల తర్వాత ఇటీవలే ది వారియర్ తో వచ్చింది.
వరుస సక్సెస్ లలో ఉన్న ఈ బ్యూటీకి ది వారియర్ సినిమా ప్లాప్ అందించింది.వరుస హిట్స్ పడడంతో హ్యాట్రిక్ విజయం అందుకున్న బేబమ్మ మరో మెట్టు ఎక్కి స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లాలనుకున్న ఆమె ఆశలపై నీళ్లు ఆ ప్లాప్ చల్లింది.
ఇక ఈ ప్లాప్ తర్వాత ఈ అమ్మడు నితిన్ హీరోగా వచ్చిన మాచర్ల నియోజక వర్గం లో నటించింది.ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
దీంతో ఈమె ఖాతాలో మరో ప్లాప్ పడింది అనే చెప్పాలి.ఇక ఇప్పుడు సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

2021 ఫిబ్రవరి నుండి 2022 సెప్టెంబర్ మధ్య దాదాపు ఆరు తెలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇటీవల కాలంలో ఏ హీరోయిన్ చేయనన్ని సినిమాలు ఈమె నుండి వచ్చాయి.అయితే అందులో ఆశించిన విజయాలు తక్కువ.
దీంతో ఎక్కువ కాలం ప్లాప్ లతోనే సాగితే ఈమె టాలీవుడ్ కు దూరం కాక తప్పదు.ప్రెజెంట్ కృతి చేతిలో నాగ చైతన్య సినిమా, సూర్య సినిమాలు ఉన్నాయి.
ఇవైనా ఈమెను ఆదుకుంటాయో లేదో చూడాలి.







