100 రోజులకు పైగా బిగ్ బాస్ హౌస్ లో ఉంటూ ఎన్నో గొడవలు, కొట్లాటలు,బుజ్జగింపులు, అలకలు, ఫ్రెండ్షిప్ అన్నింటికి ఈరోజుతో తెరపడబోతుంది.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ 7 ( Biggboss7 ) గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.
బిగ్ బాస్ 7 విన్నర్ ఎవరు? ఎవరు కప్ కొట్టబోతున్నారు అనే దాంట్లో ప్రతి ఒక్కరికి ఉత్కంఠ ఉండబోతుంది.ఈ ఉత్కంఠకు తెరపడేలా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే బయటి వాళ్లు ఈ పోస్టులు పెడితే వేరేలా ఉండేది కానీ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన సందీప్ మాస్టర్ (Sandeep master) భార్య దీనికి సంబంధించిన పోస్ట్ పెట్టడం ప్రస్తుతం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
సందీప్ మాస్టర్ భార్య జ్యోతి రాజ్ ( Jyothi raj ) తన సోషల్ మీడియా ఖాతాలో నీ కష్టం ఎప్పుడు వృధాగా పోదు తమ్ముడు.
గాడ్ బ్లెస్స్ యు రా పల్లవి ప్రశాంత్ SPY అభిమానులు అందరూ ఈరోజు రాత్రి 8:30 కు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేయండి.అంటూ పోస్ట్ పెట్టింది.
అంతేకాకుండా పల్లవి ప్రశాంత్ కే నా భర్త సపోర్ట్ న్యాయం వైపు ఉండడం కోసం నా భర్త ఫ్రెండ్షిప్ ని సైతం పక్కన పెట్టారు అంటూ వరుస పోస్టులు పెట్టింది.అయితే బిగ్ బాస్ షో కి వెళ్లి వచ్చారు సందీప్ మాస్టర్.

అయితే ఆయన భార్య ఇలాంటి పోస్ట్లు పెట్టడం వల్ల అందరూ పల్లవి ప్రశాంతే విన్నర్ అని అంటున్నారు.అంతేకాకుండా పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) సోషల్ మీడియా అకౌంట్లో కూడా పల్లవి ప్రశాంత్ విన్నర్ అంటూ ఒక అఫీషియల్ పోస్ట్ పెట్టారు.మనం చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉంటే కచ్చితంగా ఆ విజయం మన వెన్నంటే ఉంటుంది.పట్టు వదలకు మిత్రమా విజయం తప్పకుండా నిన్నే వరిస్తుంది అంటూ పోస్ట్ పెట్టడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

అంతే కాదు పల్లవి ప్రశాంత్ ఊర్లో విన్నర్ అనౌన్స్ చేయడం కంటే ముందు రోజే సంబరాలు చేసుకున్నారు.దీంతో అందరూ పల్లవి ప్రశాంతే విన్నరని భావిస్తున్నారు.అలాగే రెండో స్థానంలో అమర్ దీప్ ఉన్నారని కొన్ని వెబ్సైట్లు రాసుకొస్తే మరికొన్ని వెబ్సైట్లు శివాజీ ( Sivaji ) రెండో స్థానంలో ఉన్నారని చెప్పుకొస్తున్నారు.అయితే బిగ్ బాస్ ఉల్టా పల్టా కాబట్టి చివరి నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఎపిసోడ్ పూర్తిగా చూడాల్సిందే.