దేశంలో అతిపెద్ద పాలసీ కంపెనీలైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో ఓ కొత్త రకం మోసాలకు తెరతీసింది.పాలసీ వెనక్కి తీసుకుంటే అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయని.
మోసపూరిత కాల్స్ చేస్తూ తీరా వారి డబ్బులను దోచేస్తున్నారు.అందుకే ఎల్‌ఐసీ.
పాలసీ తీసుకున్నవారికి ఓ బిగ్ అలెర్ట్ చెప్పింది.ఇప్పటికే బ్యాంకింగ్ ఆన్‌లైన్ మోసగాళ్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే! తాజాగా ఎల్‌ఐసీ పాలసీ హోల్డర్ల వంతైంది.
పాలసీదారులకు ఐఆర్‌డీఏఐ అధికారులమని లేదా ఎల్‌ఐసీ ఉద్యోగులమంటూ ఫోన్లు చేస్తున్నారు.
ఈ విధంగా కస్టమర్లను నమ్మించి వారి బ్యాంకు ఖాతాలను ముంచేస్తున్నారు.
ఈ మోసగాళ్లు ముఖ్యంగా పాలసీదారులతో విశ్వాసంగా నడుచుకుంటారు.వారి నుంచి పర్సనల్ డేటాను సేకరించి ఖాతాల నుంచి డబ్బును తస్కరిస్తారుఇటువంటి కేసులు తరచుగా వస్తున్నాయని ఎల్‌ఐసీ తమ కస్టమర్లను ఈ మోసాల నుంచి రక్షించడానికి హెచ్చరికలు జారీ చేసింది.
ఎల్‌ఐసీ ఏ పాలసీదారులను పాలసీ సరెండర్ చేసుకోమని సూచించదని తెలిపింది.అనుమానాస్పద కాల్స్‌ను స్వీకరించకూడదని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.
ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే తమ పాలసీని నమోదు చేసుకోవాలని.కేవలం తమ అధికారిక వెబ్‌సైట్లలోని సమాచారాన్ని పొందాలని కంపెనీ చెబుతోంది.
దీన్ని మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్వీటర్ వేదికగా తెలిపింది.పాలసీదారులను మోసం చేసే సదరు తప్పుడు ఫోన్ కాల్స్‌ను నమ్మకూడదని తప్పుడు పాలసీ సమాచారాన్ని అందిస్తున్నారన్నారు.గత కొన్ని రోజుల్లో ఇటువంటి మోసపూరిత కేసులు కొన్ని లక్షల్లో తమ దృష్టికి వచ్చాయన్నారు.కస్టమర్లు తమ పాలసీలకు సంబంధించిన ఏవైనా వివరాలు కావాలంటే కేవలం అ«ధికారిక వెబ్‌సైట్ అయిన లోనే సంప్రదించాలన్నారు.
అంతేకాని, ఏ ఫోన్ నంబర్ల నుంచి పాలసీ అధికారులమని చెప్పేవారిని అస్సలు నమ్మకూడదన్నారు.ఒకవేళ మీకు ఏదైనా కాల్ మీకు అనుమానంగా ఉంటే వెంటనే మీకు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎల్‌ఐసీ తెలిపింది.లేకపోతే spuriouscalls@licindia.com తెలపవచ్చు.లేదా ఛిౌచిco_crm_fb@licindia కి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.అధికారిక వెబ్‌సైట్‌లో కూడా గ్రీవెన్స్ రెడ్రెస్సెల అధికారుల నంబర్లు ఉంటాయి.వారిని సంప్రదించి ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
ఫేక్ కాల్స్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ముఖ్యంగా అటువంటి ఫేక్ కాల్స్‌లో ఎక్కువ శాతం మాట్లాడకూడదు. పర్సనల్ వివరాలను చెప్పవద్దు.పాలసీ సరెండర్ వివరాలు చెప్పవద్దు.ఇది కాకుండా ఏవరైనా పాలసీకి సంబంధించి మరింత ప్రయోజనాలను పొందడం గురించి మాట్లాడినా నమ్మవద్దు.ముఖ్యంగా ఎట్టిపరిస్థితుల్లో వివరాలు కాలర్‌తో షేర్ చేయకూడదు.