జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) బుధవారం భీమవరంలో పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా మరోసారి భీమవరం( Bhimavaram ) నుండి పోటీ చేయబోతున్నట్లు పవన్ స్పష్టం చేశారు.
వైసీపీ. సిద్ధం అంటే మేము.యుద్ధం అంటాం.నన్ను ఎక్కడైనా ఆపాలని చూస్తే మాట్లాడను చేతల్లో చూపిస్తా అని హెచ్చరించారు.తాము అధికారంలోకి వస్తే పథకాలు ఆపేస్తారని జగన్( CM Jagan ) తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు కొనసాగించాల్సిందేనని సంక్షేమ పథకాలు భవిష్యత్తులోను కొనసాగుతాయని పవన్ పేర్కొన్నారు.
“జనసేన-టీడీపీ-బీజేపీ” కూటమి అధికారంలోకి వచ్చాక లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉంటుందని తెలిపారు.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్( MLA Grandhi Srinivas ) విమర్శలు చేశారు.భీమవరంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ సృష్టించడానికి పవన్ కళ్యాణ్ వచ్చారని ఆరోపించారు.కులాల మధ్య గొడవలు సృష్టించటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ మొత్తం మీద మూడుసార్లు భీమవరం వచ్చారని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ పార్టీకి వెన్నెముక లేదని అందుకే పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు.సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా పవన్ నటిస్తున్నట్లు ఉందని సెటైర్లు వేశారు.సీఎం జగన్ ని ఎదుర్కోలేకే ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతల గడ్డం.
పట్టుకుంటున్నారు.భీమవరం ప్రజలు పవన్ కళ్యాణ్ ని మళ్ళీ షూటింగ్లకు పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.