బండ్ల గణేష్ ( Bandla ganesh )మరోసారి సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.ఆ మధ్య ఒక దర్శకుడి గురించి విమర్శలు చేస్తూ ఇండైరెక్ట్ గా విమర్శలు చేసిన బండ్ల గణేష్ ఇప్పుడు మరో విధంగా స్పందించాడు.
తాజాగా సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తనన డ్రీమ్ ప్రాజెక్ట్ సాకారం కాబోతుంది అంటూ బాలయ్య తో సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే.బండ్ల గణేష్ ఆ ట్వీట్ కు ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
తాను పవన్ కళ్యాణ్ గారితో సినిమాను చేయాలి అనుకుంటున్నాను.అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్.
ఎప్పటికి కూడా అదే నా డ్రీమ్ అన్నట్లుగా బండ్ల గణేష్ పేర్కొన్నాడు.దాన్ని బట్టి బండ్ల గణేష్ సున్నితంగా నిర్మాత నాగ వంశీ కి కౌంటర్ ఇచ్చాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
సోషల్ మీడియాలో బండ్లన్న చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.ఈసారి గురూజీని వదిలేసి ఇలా నాగ వంశీ పై పడ్డావేంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి బండ్ల గణేష్ యొక్క ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.నాగ వంశీ ( Naga vamsi )ప్రతి హీరోతో కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉంది.అందుకే బాలయ్య తో నాగ వంశీ సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ కామెంట్స్ చేయడం.అందుకు బండ్లన్న స్పందించడం బాగుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ నాగవంశీ నిర్మాణంలో బాలయ్య 109వ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.
నాగ వంశీ మరియు బండ్ల మధ్య జరిగిన ట్వీట్స్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.గత కొన్నాళ్లు గా పవన్ ( pawan kalyan )కాంపౌండ్ కి బండ్ల దూరంగా ఉంటున్నాడు.అందుకు కారణం ఏంటి అనేది మాత్రం తెలియరాలేదు.
పవన్ తో సినిమా ను నిర్మించబోతున్నట్లుగా బండ్ల ప్రకటించాడు.ఆ తర్వాత ఏం జరిగిందో కానీ మళ్లీ పవన్ ను బండ్ల కలువలేక పోయాడు.
ముందు ముందు అయినా బండ్లకు పవన్ ను కలిసే అవకాశం వస్తుందా అనేది చూడాలి.కొందరి కారణంగానే తనకు పవన్ కు గ్యాప్ వచ్చిందని బండ్ల ఆరోపిస్తున్నాడు.