బీజేపీపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని పేర్కొన్నారు.
బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీ ట్రాప్ లో పడిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.పసుపు కండువా మార్చి కాషాయ చొక్కాలు వేసుకున్న వారి మాటలను అమిత్ షా పలకడం దారుణమన్నారు.ఏపీ అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో చెప్పి అప్పుడు బీజేపీ ఉత్సవాలు జరుపుకుంటే మంచిదని తెలిపారు.2014-19 మధ్య జరిగిన అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందని ఆరోపించారు.2014 ఎన్నికల నాటి హామీలు ఏమయ్యాయో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేశారు.







