బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్( BJP MP Bandi Sanjay ) నేడు విజయవాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఓటర్ అవగాహన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పాల్గొన్నారు.హైదరాబాదు నుండి వర్చువల్ గా పాల్గొన్న బండి సంజయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) పై పొగడ్తల వర్షం కురిపించారు.
ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకత్వంతోనే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరారని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ప్రజాభిమానం ఉన్న నేత అని కొనియాడారు.అటువంటి నాయకుడు ప్రజా సమస్యలపై జనంలోకి వెళుతుంటే ఆయనను అడ్డుకోవడం దారుణమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాడు దొంగ పాదయాత్రలతో జగన్( YS Jagan ) అధికారంలోకి వచ్చారు.కానీ నేడు రాష్ట్రంలో పాదయాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్న ప్రతిపక్ష పార్టీల పాదయాత్రలను ఆపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.ఇదే సమయంలో ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే మీడియా సంస్థల గొంతు నొక్కి ప్రయత్నం కూడా ఏపీలో జరుగుతుందని అన్నారు.కొన్ని సంస్థలకు…వ్యక్తులకు కులాన్ని అంటగడుతూ రాజకీయం చేయడం దారుణమని బండి సంజయ్ విమర్శించారు.
ఆంధ్ర రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు వెంకన్న భక్తులు.శివాజీ, అంబేద్కర్, మోడీ వారసులు.
ఓటర్ నమోదు కార్యక్రమంతో పాటు ఓటర్ చేతన్ మహాబీఎన్ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని.బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.