బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కలిశారు.జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనకు అవకాశం ఇచ్చినందుకు నడ్డాకు ధన్యవాదాలు చెప్పారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే జేపీ నడ్డాకు కండువా కప్పి సన్మానించారు బండి సంజయ్.పార్టీ నూతన జాతీయ ప్రధాన కార్యదర్శి రాధామోహన్ అగర్వాల్ తో కలిసి దాదాపు 15 నిమిషాల పాటు జేపీ నడ్డాతో చర్చలు జరిపారని సమాచారం.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని బండి సంజయ్ వెల్లడించారు.పార్టీ హైకమాండ్ ఏ బాధ్యతలు అప్పగించినా చేసేందుకు సిద్ధమని తెలిపారు.