ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా మూర్తి( Sudha Murthy ) గారు ఒక యు ట్యూబ్ షోలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎన్నో ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ ఎంతో సాధారణ జీవితం గడిపే సుధా మూర్తి గారిపై ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేంత పెద్ద తప్పు ఆవిడా ఏం చేసారు? ఉన్నపాటుగా నెటిజన్లు ఆవిడపై ఆగ్రహం వ్యక్తం చెయ్యడానికిగల కారణం ఏమిటి.

సుధా మూర్తి గారు ఈ మధ్య ఆహార విశ్లేషకుడు, నటుడు అయినా కునాల్ విజయకర్ ( Kunal Vijayakar )తో కలిసి “ఖాన్ మైం కావున హాయ్”( Hi Khan Maim Kavu ) అనే యు ట్యూబ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ షోలో ఆమె తన ఆహరం అలవాట్ల గురించి మాట్లాడారు.తాను పూర్తిగా శాకాహారినని, మాంసాహారం అస్సలు ముట్టనని, వెల్లుల్లి కూడా వాడనని చెప్పుకొచ్చారు.ఇండియా లో మాత్రమే కాకుండా, విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా తాను భోజనం ప్యాక్ చేసి తీసుకువెళ్తారట.
ఎప్పుడు ఆమె బ్యాగ్లో 20 – 30 చపాతీలో సిద్ధంగా ఉంటాయట.ఐతే ఈ షోలో ఆమె చేసిన ఒక కామెంట్ ఇప్పుడు దుమారాన్ని రేపుతోంది.“నేను విదేశాలు వెళ్ళినప్పుడు రెస్టాయూరాంట్స్ చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుంటాను.శాకాహార రెస్టారెంట్లకు వెళ్ళటానికి ఇష్టపడతాను.
నాన్ వెజిటేరియన్ స్పూన్ ఎక్కడ వెజిటేరియన్ పడిపోతుందో అని నాకు భయం” అని అన్నారు.

ఆమె అన్న ఈ మాటలకు చాలామంది నెటిజన్లు ఆమె ఈ వయసులో పాటిస్తున్న జాగ్రత్తలు ఆమెను అభినందిస్తుంటే, మరి కొందరు మాత్రం ఆమెను ట్రోల్ చేసే పనిలో పడ్డారు.ఆమె అల్లుడు, బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్( British Prime Minister Rishi Sunak ) మహాసాహారం పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేసి, ఆయనకీ, ఆయన పిల్లలకి దూరంగా ఉండమని కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరైతే ఏకంగా ఆమె కామెంట్స్ కు కులకోణాన్ని జోడించి ఆమె విమర్శితున్నారు.
సమాజానికి ఎంతో మంచి చేస్తూ, యువతరానికి మంచి సలహాలను,స్ఫూర్తిని ఇచ్చే సుధా మూర్తి, ఇప్పుడు తన ఆహార అలవాట్ల వలన కాస్టిస్ట్ ముద్ర మోయవలసి వస్తోంది.