అభిమానులు చెప్పిన టైటిల్స్ నే నిజం చేస్తున్న బాలయ్య బాబు

బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన “అఖండ” సినిమా హ్యాట్రిక్ విజయం సాధించింది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో బాలయ్య మరింత స్పీడ్ పెంచాడు.

 Balakrishna With Fans Interested Titles,balakrishna,social Media,balakrishna Fan-TeluguStop.com

ప్రస్తుతం క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇటీవలే బాలయ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అభిమానులకు పూనకాలు తెప్పించింది.

అందులో బాలయ్య చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు గూస్బమ్స్ తెప్పించాయి.మాస్ గెటప్ లో బాలయ్య లుక్ కూడా ఇందులో డిఫరెంట్ గా ఉంది.

ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ తెలంగాణలో జరుగుతోంది.అయితే ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారనేది ఆసక్తికరంగా మారింది.ఫైట్ సీన్లు చూస్తుంటే మాస్ సినిమా అని తెలుస్తుండటంతో బాలయ్య క్రేజ్ కు తగ్గట్లు మంచి పవర్‌ఫుల్ మాస్ టైటిల్ పెట్టే అవకాశముంది.టైటిల్ విషయంలో అభిమానుల సహయం కూడా నిర్మాతలు తీసుకోనున్నారు.

Telugu Balakrishna, Powerful Mass-Movie

బాలయ్య సినిమాకు టైటిల్స్ ను అభిమానులే డిసైడ్ చేస్తున్నారనే టాక్ గత కొంతకాలంగా నడుస్తోంది.బాలయ్య సినిమాల విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే టైటిల్స్ ను నిర్మాతలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.దాదాపు బాలయ్య సినిమాలన్నింటికీ ఇలాగే ఫ్యాన్స్ టైటిల్ ఫిక్స్ చేస్తున్నారు.ఇప్పుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించబోయే సినిమాకు కూడా బాలయ్య అభిమానులే టైటిల్ ఫిక్స్ చేయనున్నారట.

అభిమానులు సూచించిన టైటిల్ పెడితే సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయట.తన సక్సెస్ కు తన అభిమానులే కారణమని బాలయ్య ఎప్పుడూ చెబుతూ ఉంటాడు.

ఇప్పుడు ఇది చూస్తుంటే బాలయ్య మాటలను అభిమానులు ఎప్పుడూ నిజం చేస్తున్నట్లు అర్ధమవుతోంది.మరి చూడాలి బాలయ్య సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారో?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube