ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో అధికార పార్టీ
వైసిపి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ యూనివర్సిటీగా
పేరు మార్చే బిల్లు తీసుకొచ్చి ఆమోదం పొందించుకోవడం తెలిసిందే.ఈ విషయంపై పలు రాజకీయ పార్టీల నాయకులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్ ఇంకా కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు.తాజాగా ఈ విషయంపై నందమూరి బాలయ్య బాబు కూడా సోషల్ మీడియాలో చాలా ఘాటుగా రియాక్ట్ కావడం జరిగింది.
“మార్చడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అనేది పేరు కాదు.ఓ సంస్కృతి.ఓ నాగరికత.తెలుగుజాతి వెన్నెముక.తండ్రి గద్దెనెక్కి విమానాశ్రయం పేరు మార్చాడు.కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.
మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు.పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త.
అక్కడ ఆ మహానీయుడు పెట్టిన బిక్షతో నేతలున్నారు… పీతలున్నారు.విశ్వాసం లేని వారిని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.
శునకాల ముందు తలవంచుకు బతుకే సిగ్గులేని బతుకులు” అంటూ చాలా సీరియస్ గా బాలకృష్ణ రియాక్ట్ కావడం జరిగింది.