టిఆర్ఎస్ గా లో ఉన్నటువంటి పార్టీ బిఆర్ఎస్ ( BRS ) పార్టీగా మారింది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సెంటిమెంటుతో రాష్ట్రం సాధించి తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారి సీఎం అయ్యారు కెసిఆర్.
అలాంటి కెసిఆర్ ( KCR ) దేశవ్యాప్తంగా ఎవరూ ఊహించినటువంటి పథకాలు తీసుకువచ్చారు.ఇందులో ప్రజలకు ఎంతో మేలు చేసే పథకాల విషయానికి వస్తే రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, పెన్షన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు పేద ప్రజల కోసం ఉపయోగపడుతున్నాయి.
దీంతో రెండు పర్యాయాలు ఏకధాటిగా అధికారంలోకి వచ్చి సీఎం అయ్యారు కెసిఆర్.అయితే మూడవ పర్యాయం కూడా బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఈ క్రమంలోనే ముందస్తుగానే లిస్టు ప్రకటించి బీఫామ్స్ ఇస్తున్నారు.అన్ని బాగానే ఉన్నా కానీ నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇలా చదువుకున్న విద్యార్థులకు కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని గత కొంతకాలంగా నిరుద్యోగుల నుంచి తిరుగుబాటు రాగం వినబడుతోంది.
ఇదే క్రమంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని అనేకమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా ఇప్పటికే ప్రకటించి ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉంది.
అయితే ఈసారి కాంగ్రెస్ ( Congress ) నుంచి దెబ్బ పడే అవకాశం ఉందని గ్రహించిన కేసీఆర్, కొత్త మేనిఫెస్టో పేరుతో కొన్ని పథకాలను ప్రకటించారు.ఆయా వర్గం ప్రజలను ఆకట్టుకున్నాయి.
ఈ పథకాలతో మైలేజ్ వచ్చిందా అనే విషయానికి వెళ్తే.ఈ పథకాలలో కొత్తదనం ఏమీ లేదని ప్రజలు భావిస్తున్నారు.ఇప్పటికే ఆసరా పింఛన్లు 2016 లు ఇస్తున్నారు .అయితే బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే 3016లకు పెంపు చేస్తామని, ఆ తర్వాత దశలవారీగా ఐదేళ్లలో ఐదు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.అంతేకాకుండా సౌభాగ్య లక్ష్మి పేరుతో మహిళలకు నెలనెలా 3000 జీవనభృతి ఇస్తామన్నారు.ఈ పథకాన్ని ఆల్రెడీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది.అంతేకాకుండా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 5 లక్షల బీమా ఉంటుందని అన్నారు.
ఇప్పటికే రైతు బీమా ( Rythu bheema ) కొనసాగుతోంది.అలాగే రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అన్నారు.దివ్యాంగులకు రాబోవు రోజుల్లో 6000 పెన్షన్, అలాగే రైతుబంధు ఇప్పటివరకు ఎకరాకు ఏడాదికి 10000 ఇచ్చేది, అధికారంలోకి వస్తే 12 వేలకు పెంపు, అంతేకాకుండా ఐదేళ్లలో 16,000 పెంచుతామని హామీ ఇచ్చారు.
మహిళా సమైక్య భవనాలు, 400కే గ్యాస్ సిలిండర్, అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూలు, మైనారిటీల సంక్షేమం, పేదలకు ఇండ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షల పెంపు, ఈ విధంగా పథకాలు ప్రవేశపెట్టారు.అయితే ఈ పథకాలలో ఏవి కొత్తగా లేవని , ఉన్న పథకాలనే కాస్త పెంపు చేశారని ప్రజలు భావిస్తున్నారు.
అంతేకాకుండా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని పేదలకు మూడెకరాల భూమి ఇస్తామని , ఇదివరకు ఎన్నికల్లో ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు కొత్త పథకాలు ప్రకటించారు.మరి ఈ పథకాలైన అమలు చేస్తారా లేదా అని ప్రజలు కాస్త ఆలోచనలు పడ్డారట.
అంతేకాకుండా ఈ పథకాల్లో కొత్తదనం ఏమీ లేదని, ఇదివరకు కేసీఆర్ చెప్పిన పథకాలే మళ్లీ మాడిఫై చేశారంటూ ప్రజలు ఆలోచిస్తున్నారు.దీన్ని బట్టి చూస్తే మాత్రం కొత్త పథకాలతో ప్రజల్లో అంతగా మైలేజ్ రాలేదని తెలుస్తోంది.