ప్రస్తుతం బాబీ, బాలయ్య కాంబో లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అయిన బాబీ డియోల్ ని( Bobby Deol ) తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి నిజానికి ఈ క్యారెక్టర్ లో ఆయన ని తీసుకోవాలి అని బాబీ కి ఎందుకు అనిపించిందంటే రీసెంట్ గా వచ్చిన అనిమల్ సినిమాలో( Animal Movie ) బాబి డియోల్ నటించిన పాత్ర చాలా హైలెట్ గా నిలవడంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.దాంతో ఆ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమాలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
ఆయన్ని ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా చూపించబోతున్నట్టు గా తెలుస్తుంది.
ఇక బాలయ్య బాబు( Balakrishna ) హీరో గా వచ్చిన లెజండ్ సినిమాలో జగపతి బాబు ని బోయపాటి ఎలా చూపించాడో దానికి మించిన స్టైలిష్ లుక్ లో బాబీ ( Bobby ) ఈ సినిమాలో బాబు డియెల్ ని చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.నిజానికి ఈ సినిమాలో మొదట వేరే విలన్ ని తీసుకోవాలి అనుకున్నప్పటికీ ఈ సినిమాకి అతను సెట్ అవ్వడని చివరి నిమిషంలో మార్చేసి బాబీ డియోల్ ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ సినిమాలో ఎంతవరకు మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.అయితే ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది… ఇక గత సంవత్సరం చిరంజీవికి అదిరిపోయే హిట్ ఇచ్చిన బాబీ ఇప్పుడు బాలయ్యకి కూడా అదిరిపోయే హిట్ ఇస్తాడంటు తన అభిమానులు ఇప్పటికే మంచి అంచనాలను పెట్టుకున్నారు.మరి ఈ సినిమాలో బాలయ్య ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాతో ఆయన ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి బాబీ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో…
.