జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి వారిలో సుడిగాలి సుధీర్( Sudigali Sudheer ) ఒకరు సుధీర్ ఒకప్పుడు జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతున్న ఈయన అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు అయితే తన కామెడీ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సుడిగాలి సుదీర్ అనంతరం హీరోగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయన బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.
ఇకపోతే ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్క బుల్లితెర ఛానల్ ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈటీవీలో అల్లుడా మజాకా అనే కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో వెంకటేష్(Venkatesh) కూడా ముఖ్యఅతిథిగా హాజరై సందడి చేశారు.అదేవిధంగా సీనియర్ హీరోయిన్స్ అయినటువంటి కుష్బూ, మీనా(Kushboo ,Meena) వంటి వారు కూడా సందడి చేశారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమోలో సుడిగాలి సుదీర్ గురించి అమ్మాయిలు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.సుడిగాలి సుదీర్ సాధారణంగా అమ్మాయిలంటే చాలా గౌరవం కానీ స్కిట్లలో భాగంగా ఈయనకు అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు సుదీర్ ను ఒక ఆట ఆడుకున్నారు.సుధీర్ ఎలాంటి వాడు అని ఒక అమ్మాయిని అడగగా అతను నా భర్త అంటూ సమాధానం చెప్తుంది.
సుడిగాలి సుదీర్ గురించి మరొక అమ్మాయిని అడగడంతో ఆయన ప్రతిరోజు రాత్రి నాకు వీడియో కాల్స్ చేస్తారంటూ షాకింగ్ సమాధానం చెప్పింది అప్పుడు మా అమ్మాయి ఎవరు అంటూ అడుగుతుందని మా అమ్మ అని చెబితే మా అమ్మని కూడా ఒకసారి చూపించు అంటూ అడుగుతూ ఉంటాడని ఆ అమ్మాయి సుధీర్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ అమ్మాయి మాట్లాడిన మాటలకు సుధీర్(sudigali sudheer) షాక్ అవుతాడు, నేనెప్పుడు నీకు కాల్ చేశాను తల్లీ అంటూ భయంగా అడుగుతాడు.ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఇదంతా కేవలం స్కిట్లు భాగంగా మాత్రమే జరిగిందని ఇదంతా కేవలం స్కిట్ లో భాగంగా మాత్రమే జరిగిందని తెలుస్తుంది.
ఇక సుధీర్ ప్రస్తుతం బుల్లితెరకు దూరమయి వెండితెర సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.