1.మూడోసారి తెలంగాణ సీఎం కేసీఆరే
మూడోసారి కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ పార్టీకి 45 నుంచి 50 స్థానాల్లో అభ్యర్థులు లేరని మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
2.టిడిపి మహానాడు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని కడియం మండలం వేమగిరి నాలుగో లైన్ల జాతీయ రహదారి వద్ద శుక్ర శనివారాల్లో టిడిపి మహానాడు ను నిర్వహించనున్నారు.
3.అవినాష్ రెడ్డి తల్లి హెల్త్ బులిటెన్ విడుదల
కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి హెల్త్ బుల్లెట్ ను కర్నూలు విశ్వభారతి వైద్యులు విడుదల చేశారు.ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుందని , ఈరోజు వైద్యులు డిశ్చార్జ్ చేశారు.గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆమెను హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
4.చంద్రబాబుపై జగన్ విమర్శలు
నరకాసురుడునైన నమ్మండి కానీ ,నారా చంద్రబాబునాయుడు ను నమ్మొద్దు అంటూ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ చంద్రబాబు పై విమర్శలు చేశారు.
5.పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాపురంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద 50వేల 793 మందికి జగన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారు.
6.బండి సంజయ్ కామెంట్స్
తెలంగాణ బిజెపి నాయకులు మధ్య విభేదాలు అంటూ ఓ సెక్షన్ మీడియా ప్రచారం తప్ప మాకు ఎలాంటి విభేదాలు లేవని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
7.నేడు ఢిల్లీకి జగన్
వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు రేపు జరగబోయే నీతి అయోగ్ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు.
8.ఏపీలో వర్షాలు
ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
9.టిడిపి మహానాడు పై ఎంపీ భరత్ విమర్శలు
టిడిపి మహానాడు పేరుతో రాజమండ్రిని నాశనం చేస్తున్నారని వైసిపి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు.
10.పాలీసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి.
11.500 కే గ్యాస్ సిలిండర్ : రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
12.కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుంది : భట్టి
మరో ఐదు నెలల్లో కాంగ్రెస్ తెలంగాణలో తప్పకుండా అధికారంలోకి వస్తుందని సీఎల్పీ నేత మల్లు బట్టు విక్రమార్క అన్నారు.
13.ఓ ఆర్ ఆర్ టోల్గేట్ అంశంపై సిబిఐ దర్యాప్తు చేయాలి
ఓ ఆర్ ఆర్ టోల్గేట్ అంశంపై సిబిఐ దర్యాప్తు చేయాలని దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
14.ఉచితంగా పెట్రోల్
అనకాపల్లి జిల్లా నక్కలపల్లి లోని ఓ సంస్థ ప్రతినిధి తన కుటుంబ సభ్యుడి జన్మదిన సందర్భంగా పెట్రోల్ ఫ్రీగా పంపిణీ చేపట్టారు.
ఒక్కొక్కరికి రెండు లీటర్లు చొప్పున 150 మందికి కుపన్లను పంపిణీ చేశారు.దీంతో భారీగా రద్దీ నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
15.హజ్ యాత్ర కు తోమత్తు లేని వారికి సహకారం
హజ్ యాత్రకు ఆర్థికంగా స్తోమత లేని వారికి తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
16.సలహాదారులపై తులసి రెడ్డి విమర్శలు.
ఏపీ ప్రభుత్వ సలహాదారులపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి విమర్శలు చేశారు.సలహాదారులు కాదు స్వాహా దారులు అంటూ ఆయన మండిపడ్డారు.
17.వడగలుపులపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ జాగ్రత్తలు
ఏపీలో ఎండల ప్రభావం అధికంగా ఉండడంతో వడగాలి పిల్లలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది ఈరోజు 84 మండలాలు వర్గాలకు ఇచ్చే అవకాశం ఉందని ప్రకటించింది.
18.ఇళ్ల స్థలాల పంపిణీపై బోండా విమర్శలు.
అమరావతిపై కక్షతోని వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ సెంటు చొప్పున పట్టాలను పంపిణీ చేస్తున్నారని టిడిపి మాజీ ఎమ్మెల్యే పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ విమర్శించారు.
19.దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,650
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 60,710
.