వైరల్: పుష్ప మ్యానరిజం వాడుకొని టీమిండియాను వెక్కిరించిన ఆసీస్‌ అభిమాని?

బోర్డర్‌ – గవాస్కర్‌ ట్రోఫీ 23లో భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలో జరుగుతున్న 2వ టెస్టులో ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.దాంతో అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

 Australian Fan Allu Arjun Pushpa Mannerism At Cricket Match,australian Fan,pushp-TeluguStop.com

భారత్ ఆట తీరు ఎలావున్నా, తమ అభిమాన హీరో స్టైల్ ఖండాంతరాలు దాటిందని తెగ సంబరపడిపుతున్నారు.వివరాల్లోకి వెళితే… శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియాను కేవలం 263 పరుగులకే టీమిండియా ఆలౌట్‌ చేసింది.

అయితే ఆ తరువాత బ్యాటింగ్‌లో టీమిండియా కష్టాలు పడుతోంది.

వెంటవెంటనే టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది భారత్.తొలుత KL రాహుల్‌ను నాథన్‌ లయన్‌ లెగ్‌ బిఫోర్‌గా అవుట్‌ చేసేశాడు.నాథన్‌ తన మరుసటి ఓవర్‌లోనే మరో 2 వికెట్లు పడగొట్టాడు.

ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌ రెండో బంతికి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ క్లీన్‌ బౌల్డ్‌ అయిపోయాడు.ఇలా 54 పరుగులకే టీమిండియా 3 కీలక వికెట్లు కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.

ఆ తర్వాత మరికొద్ది సేపటికే శ్రేయస్‌ అయ్యర్‌ అవుట్‌ కావడంతో టీమిండియా 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి గడ్డు అపరిస్తితుల్లో పడింది.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా అభిమానులు ఫుల్‌ జోష్‌లో కనిపించారు.అయ్యర్‌ వికెట్‌ పడగానే.ఓ ఆస్ట్రేలియన్‌ అభిమాని ‘పుష్ప’ సినిమాలోని “అల్లు అర్జున్‌” మ్యానరిజం ‘గడ్డం కింద చేయి పోనిచ్చి.

తగ్గేదేలే’ అంటూ టీమిండియాను పుండు మీద కారం జల్లినట్టు వెక్కిరించాడు.తొలి మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటున్నాం అనే కసి వారిలో స్పష్టంగా కనిపించింది.కాగా అతను పుష్ప మ్యానరిజం ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.ఈ ఘటన క్రికెట్‌ అభిమానులకు కష్టంగా వున్నా, బన్నీ అభిమానులను మాత్రం ఖుషి చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube