దేవుడా: డోమినోస్ చేసిన ఈ వెరైటీ పిజ్జాను ట్రై చేశారా..?!

పిజ్జా అంటే ఈనాటి యూత్ కి చాలా ఇష్టం.ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద సిటీల్లో ఉండేవారు వారానికి ఒకసారైనా పిజ్జా తినాలని అనుకుంటారు.

 Dominos Australia Makes Water Melon Pizza Viral Video, Dominos Australia , Wate-TeluguStop.com

ఇకపోతే కంపెనీల్లో పనిచేసే ఐటీ ఫీల్డ్ ఉద్యోగులు అయితే పిజ్జాలను తెగ తినేస్తుంటారు.ఈ పిజ్జాల్లో కూడా ఛీజ్ పిజ్జా, చికెన్, మటన్ పిజ్జా ఇలా ఎన్నో రకాల పిజ్జాలను ఇష్టంగా తినేవాళ్లు ఉన్నారు.

సాధారణంగా పిజ్జాల్లో టమోటా, క్యాప్సికమ్, ఉల్లిపాయలు వంటివి వేసి పిజ్జాలను తయారు చేస్తుంటారు.అయితే ఈ సారి డొమినోస్ ఒక అద్బుతమైన ఐడియాతో పిజ్జాను చేసింది.

వెరైటీగా ఉంటుందని పుచ్చకాయతో పిజ్జా చేసింది.చాలా ఫుడ్ కంపెనీలు తమ ఫుడ్ ను పాపులర్ చేసుకోవడానికి, అలాగే తమ సంస్థకు ఎక్కువ మంది కస్టమర్లను రప్పించుకోవడానికి రకరకాల వెరైటీ వంటకాలను తయారు చేస్తుంటుంది.

కొత్త రుచుల వల్ల కస్టమర్లు కూడా విపరీతంగా పెరుగుతుంటారు.

ఫుడ్ మీద ఇష్టం ఉండేవారు కూడా రోజురోజుకూ ప్రత్యేక రుచితో ఉన్న ఫుడ్ ను ఎక్కువగా తినాలని చూస్తుంటారు.దీంతో కస్టమర్ల దేవుళ్లకు న్యాయం చేయడం కోసం ఫుడ్ సంస్థలు వెరైటీ ఫుడ్ లను రెడీ చేస్తుంటాయి.ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఫుడ్ సంస్థ అయిన అమూల్ పసుపుతో ఐస్ క్రీమ్ ను చేసి వదిలింది.

అది ప్రజలకు అంతగా నచ్చకపోవడంతో ఆ తర్వాత పిజ్జాపై పైనాపిల్ ముక్కలు వేసి చేసి సక్సెస్ అయ్యింది.ఇటువంటి తరుణంలోనే డోమినోస్ సంస్థ తమ కస్టమర్ల కోసం వెరైటీ పిజ్జాను తయారు చేసింది.

ఆస్ట్రేలియాలోని డోమినోస్ తమ కస్టమర్ల కోసం పుచ్చకాయ పిజ్జాను చేసింది.ఆ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేయడంతో ప్రస్తుం పుచ్చకాయ పిజ్జా బాగా పాపులర్ అవుతోంది.

మామూలుగా అయితే పిజ్జాను పిండితో తయారు చేస్తారు.కానీ ఇక్కడ మాత్రం పుచ్చకాయ పండుతో పిజ్జా తయారు చేయడంతో అది కాస్తా పాపులర్ అయ్యింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube