చరణ్ ఎప్పుడు నాకు గర్వకారణం.. భర్త పై ప్రశంసలు కురిపించిన ఉపాసన?

మెగా కోడలు ఉపాసన(Upasan ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.ఇక తనకు క్లిన్ కారా (Klin Kaara) జన్మించిన తర్వాత ఉపాసన పెద్ద ఎత్తున తన భర్త కూతురితో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న సంగతి మనకు తెలుస్తోంది.

 Upasana And Ram Charan Oman Country Photos Goes Viral, Upasana, Ramcharan, Klin-TeluguStop.com

అయితే తాజాగా ఉపాసన తన భర్త కూతురితో కలిసి ఒమన్ దేశానికి వెళ్లినట్టు తెలుస్తుంది.తాజాగా ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇక ఉపాసన ఈ దేశానికి వెళ్లడానికి కారణం లేకపోలేదు.ఉపాసన ఫ్యామిలీకి చెందిన జైదుస్ అనే కంపెనీ వర్క్ మీద వెళ్లినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలో ఉపాసన ఫ్యామిలీ, రిలేటివ్స్ కూడా వీరితో కలిసి సందడి చేసారు.ఈ క్రమంలోనే అక్కడ దిగినటువంటి ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన భర్త రామ్ చరణ్(Ram Charan) పై ప్రశంసల వర్షం కురిపించారు.

రామ్ చరణ్ నాకు ఎంతో గర్వకారణం.నేను వర్క్ లో ఉన్నప్పుడు నాన్నగా బాధ్యతలు తీసుకొని నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తాడు.ఈ మీటింగ్ ని స్పెషల్ గా చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.ఇక జైదుస్ (Zydus)కంపెనీ గొప్ప కంపెనీ, గొప్ప ఫలితాలు రాబడుతుందని ఈమె అక్కడ దిగినటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రామ్ చరణ్ గురించి ఇంత గొప్పగా చెప్పడంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.

ఇక రామ్ చరణ్ పై ఉపాసన ఇలాంటి కామెంట్స్ చేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక రాంచరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ సినిమా పనులలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube