టీఎస్ఆర్టీసీ ఇకపై టీజీఎస్ఆర్టీసీగా మార్పు.. టీజీ సిరీస్ తో రిజిస్ట్రేషన్లు

టీఎస్ ఆర్టీసీ ఇకపై టీజీఎస్ ఆర్టీసీగా( TGSRTC ) మారనుంది.ఈ మేరకు త్వరలోనే లోగోలో మార్పులు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారని తెలుస్తోంది.

 Tsrtc Henceforth Changed To Tgsrtc Registrations With Tg Series Details, Gazette-TeluguStop.com

దీంతో బస్సులు టీజీ సిరీస్ తో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం( Telangana State ) ఏర్పాటైన తరువాత అప్పటి ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీగా( TSRTC ) పేరు మార్చిన సంగతి తెలిసిందే.

అయితే ఉద్యమ సమయంలో టీజీని తెలంగాణ వాదులతో పాటు ప్రజలు కూడా ఉపయోగించారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్( Congress ) తాము అధికారంలోకి వచ్చిన తరువాత టీఎస్ ను టీజీగా మార్చుతామని ప్రకటించింది.

ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ టీజీ అమలుకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో టీఎస్ కు బదులు టీజీని ఉపయోగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube