ఆ స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడతాడట.. ఇది మామూలు షాక్ కాదంటూ?

మాములుగా సెలబ్రెటీలు అనగానే లగ్జరి కార్లు, ఖరీదైన కార్లు, బట్టలు, వాచ్ లు ఇలా ప్రతీ ఒక్కటీ కూడా ఖరీదైనవి ఉపయోగిస్తారని చాలా మంది అనుకుంటూ ఉంటారు.వాళ్ళకేంటి మంచి లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు.

 Akshay Kumar Reveals Son Aarav Using Second Hand Dresses, Akshay Kumar, Aarav, B-TeluguStop.com

అయితే అందరూ అలాగే ఉంటారు అనుకుంటే పొరపాటు పడినట్లే ఎందుకంటె అందులో కొందరు మాత్రమే మంచిగా లగ్జరీగా జీవిస్తూ ఉంటారు.కానీ కొంతమంది మాత్రం సింపుల్ గా జీవించడానికి ఇష్ట పడుతూ ఉంటారు.

అలాంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి కూడా ఒకరు.

Telugu Aarav, Akshay Kumar, Bollywood, Hand Dresses, Twinkle Aarav-Movie

అతను ఒక స్టార్ హీరో కొడుకు.ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే స్టార్ హీరో తండ్రిగా ఉన్నాడు.కోట్లు సంపాదిస్తున్నాడు.

కానీ కొడుకు మాత్రం సెకండ్ హ్యాండ్ బట్టలే (second hand dresses) వాడుతున్నాడట.ఇంతకీ ఆ హీరో ఎవరు? కుమారుడు ఎవరు? ఎందుకు సెకండ్ హ్యాండిల్ బట్టలు యూస్ చేస్తున్నాడు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(akshay kumar).ఇటీవల బడే మియా చోటే మియా సినిమాతో ప్రేక్షకులను పలకరించారు అక్షయ్ కుమార్.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ను చవి చూసింది.

Telugu Aarav, Akshay Kumar, Bollywood, Hand Dresses, Twinkle Aarav-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా అక్షయ్ టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్ (Cricketer Shikhar Dhawan)హోస్టింగ్ చేస్తున్న ధావన్ కరేంగే అనే టాక్ షోలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కొడుకు ఆరవ్(aarav) గురించి ఎవరికీ తెలియని విషయాల్ని బయటపెట్టాడు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.

నేను, ట్వింకిల్ ఆరవ్‌ని(Twinkle Aarav) పెంచిన విధానంపై నాకు ఆనందంగా ఉంది.ఎందుకంటే అతడు చాలా సాధారణమైన అబ్బాయి.

ఇది చెయ్ అది చెయ్ అని అతడిని ఎప్పుడూ బలవంత పెట్టలేదు.వాడికి సినిమాలపై ఇంట్రెస్ట్ లేదు.

కానీ ఫ్యాషన్‌పై ఆసక్తి ఉంది.ఆరవ్.15 ఏళ్లకే లండన్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లాడు.అయితే అతడి వెళ్లాలని మేం కోరుకోలేదు.

కానీ వెళ్తుంటే ఆపలేదు.ఎందుకంటే నేను కూడా 14 ఏళ్లప్పుడే ఇంటి నుంచి బయటకొచ్చాను.

ఆరవ్ ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకుంటాడు.మంచి డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు కానీ ఖరీదైన బట్టలు కొనడు.

సెకండ్ హ్యాండ్ బట్టలమ్మే థ్రిప్టీ అనే షాప్‌కి వెళ్తాడు.అతడికి డబ్బు వేస్ట్ చేయడం ఇష్టం లేదు.

అందుకే ఇలా చేస్తాడు అని అక్షయ్, తన కొడుకు సీక్రెట్స్ బయట పెట్టేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube