తెలంగాణ కాంగ్రెస్ కు కలిసి వస్తున్న చంద్రబాబు అరెస్ట్ 

తెలంగాణ లో కాంగ్రెస్ కు రోజురోజుకు బలం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది.ముఖ్యంగా ఓ ప్రధాన సామాజిక వర్గం కాంగ్రెస్ కు మద్దతుగా నిలబడాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీకి బాగా కలిసి వస్తోంది.

 Arrest Of Chandrababu Who Is Joining Telangana Congress , Telangana Congress,-TeluguStop.com

టిడిపి అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో ఏపీ సిఐడి అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ అరెస్టు వెనుక కేంద్ర బిజెపి పెద్దల హస్తం ఉందని,  కమ్మ సామాజిక వర్గం నమ్ముతోంది .ఇక ఏపీ సీఎం జగన్ కు కేసిఆర్ అత్యంత సన్నిహితుడు కావడంతో బిజెపి ఆగ్రహంగా ఉందని, అందుకే ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను బలోపేతం చేసే విషయంపై ఆ సామాజిక వర్గం కీలక నిర్ణయం తీసుకుందని , కాంగ్రెస్ వైపే ఉండాలని నిర్ణయించుకోవడంతో ,అనూహ్యంగా తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) కు బలం పెరిగినట్లు అయింది.

Telugu Aicc, Brs, Pcc, Revanth Reddy, Telangana-Politics

అంతే కాకుండా , కాంగ్రెస్ సైతం కమ్మ సామాజిక వర్గానికి ఎప్పుడూ లేనంతగా ప్రాధాన్యం ఇవ్వడం, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Tummala Nageswara Rao ), మండవ వెంకటేశ్వరరావు వంటి కీలక నేతలను పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇవ్వడం , హైదరాబాద్ తో పాటు , ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండడం,  అక్కడ గెలుపోవటములను ప్రభావితం చేసే స్థాయిలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండడం , ఇవన్నీ కాంగ్రెస్ కు కలిసి వస్తున్నాయి.దీనికి తగ్గట్లుగానే కాంగ్రెస్ కూడా ఆ సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది.గతంలో టిడిపిలో యాక్టివ్ గా పనిచేసిన కమ్మ సామాజిక వర్గం నాయకులను పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు ఇస్తూ వారి ప్రాధాన్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తుండడం ఇవన్నీ కలిసి వస్తున్నాయి.

Telugu Aicc, Brs, Pcc, Revanth Reddy, Telangana-Politics

ఇదే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) టిడిపి అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల కావడం కూడా తెలంగాణ కాంగ్రెస్కు కలిసి వస్తోంది.ఈ పరిణామాలతో బీ,  బిజెపి లకు ఆందోళన కలిగిస్తున్నాయి.కమ్మ సామాజిక వర్గం పూర్తిగా కాంగ్రెస్ కు మద్దతు పలికితే,  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాలతో పాటు,  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయము ఆ రెండు పార్టీల్లో నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube