మీ ఫోన్ కావాలంటే నాకు ఆ సహాయం చేయాలి... ఊర్వశిని డిమాండ్ చేసిన నెటిజన్!

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేల(Urvashi Rautela) ప్రస్తుతం తన ఫోన్ కోసం ఎంతో ఆరాటపడుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా నరేంద్ర మోడీ స్టేడియానికి వెళ్లి అక్కడ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు.

 Urvashi Rautela Shares Mail From Person Who Stole Her Iphone Details, Urvashi Ra-TeluguStop.com

అయితే ఇలా మ్యాచ్ చూస్తూ ఎంతో ఎంజాయ్ చేసిన ఈమెకు ఆ సంతోషం కొంతసేపటి వరకు కూడా లేకుండా పోయిందని చెప్పాలి.క్రికెట్ చూడటం కోసం స్టేడియం కి వెళ్ళినటువంటి ఊర్వశి అక్కడ తన ఐఫోన్ (iPhone) పోగొట్టుకున్నారు.

అయితే ఈ ఐఫోన్ 24 క్యారెట్ల బంగారంతో తాపడం చేయించినది కావడం విశేషం.

Telugu Bollywood, India Pak, Narendramodi, Urvashi Rautela, Urvashirautela-Movie

ఈ విధంగా 24 క్యారెట్ల బంగారంతో తన ఫోన్ చేయించుకోవడంతో ఈ ఫోన్ విషయంలో ఊర్వశి చాలా బాధపడుతున్నారని తెలుస్తుంది.ఇలా తన ఫోన్ కనిపించకపోవడంతో వెంటనే ఈమె పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా తన ఫోన్ పోయిందని ఎవరికైనా దొరికితే వారికి భారీగా కానుకలు కూడా ఇస్తాను అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా బంపర్ ఆఫర్ ఇచ్చారు.అయితే ఈమె తన ఫోన్ కోసం తరచూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నటువంటి క్రమంలో ఒక నెటిజన్ మాత్రం ఈమెకు మెయిల్ చేశారు.

మీ ఫోన్ నా దగ్గరే ఉంది అంటూ ఈమెకు మెయిల్ చేయడంతో అందుకు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ ఊర్వశి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

Telugu Bollywood, India Pak, Narendramodi, Urvashi Rautela, Urvashirautela-Movie

మీ 24 క్యారెట్స్ గోల్డ్ ఐఫోన్( Gold iPhone ) నా వద్దే ఉంది అయితే ఈ ఫోన్ మీకు ఇవ్వాలి అంటే మీరు క్యాన్సర్ తో బాధపడుతున్న నా సోదరుడికి వైద్య సహాయం చేయాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు.ఇలా తన ఫోన్ కోసం క్యాన్సర్ తో( Cancer ) బాధపడుతున్నటువంటి వ్యక్తికి సహాయం చేయాలని ఆయన కోరడంతో ఈమె ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే అంటూ థమ్స్ అప్ ఎమోజిని షేర్ చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరి ఆ ఫోన్ దొరికినటువంటి ఆ వ్యక్తి ఎవరు నిజంగానే ఈమె తనకు వైద్య సహాయం చేశారా అన్న విషయాలు తెలియకపోయినా ఈమె ఫోన్ మాత్రం దొరకబోతోంది అన్న ఆనందంలో ఉన్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube