తెలంగాణలో దొరల పాలన..: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన మూడో రోజుకు చేరుకుంది.ఇందులో భాగంగా జగిత్యాలలో కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్ర కొనసాగుతోంది.

 Aristocratic Rule In Telangana..: Rahul Gandhi-TeluguStop.com

తెలంగాణలో దొరల పాలన సాగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.రాష్ట్రంలోని షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామన్న ఆయన చెరకు, పసుపు రైతులను ఆదుకుంటామని తెలిపారు.వరికి అదనంగా రూ.500 మద్ధతు ధర పెంచుతామన్నారు.తెలంగాణతో ఎప్పటి నుంచో అనుబంధం ఉందన్న రాహుల్ గాంధీ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో రాష్ట్రానికి అనుబంధం ఉందని చెప్పారు.రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని విమర్శించారు.

కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్ధతు ఇస్తుండగా తెలంగాణలో బీఆర్ఎస్ కు బీజేపీ, ఎంఐఎం మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు.అదేవిధంగా ఓబీసీలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube