దేశ చరిత్రలో కమ్యూనిస్ట్ లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.ఆహార భద్రత, సమాచార హక్కు చట్టం లాంటి ఎన్నో చట్టాల రూపకల్పనలో వారి పాత్ర ఉంది.
సెక్యులరిజం ఎజెండా గా ఎర్ర జెండా మోసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.అలాంటి కమ్యూనిస్ట్ లు ఇప్పుడు చిందర వందరగా మారారు.
ఒకప్పుడు ప్రభుత్వాలను, ప్రతి పక్షాలను వణికించిన కమ్యూనిస్ట్ లు ఇప్పుడు కనుమరుగు అయ్యే స్థాయికి చేరుకున్నారు.
కమ్యూనిస్ట్ లు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తోనే ఉండే వారు.
కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు వాళ్ళ అండతోనే ప్రభుత్వాన్ని నడిపింది.ఇక తెలంగాణ లోనూ వాళ్ళు చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ తోనే నడిచారు.
అయితే ఒక్క మునుగోడు ఎన్నికల తో సీన్ రివర్స్ అయ్యింది.ఆ పార్టీ లు ప్లేట్ ఫీరా ఇంచి.
గులాబీ పార్టీ కి జై కొట్టారు.కేసిఆర్ కు ఎంతో ప్రతిష్టాత్మక మైన మునుగోడు ను పదివేల మెజారిటీ తో.కెసిఆర్ కు అప్పగించారు.ఇక జాతీయ స్థాయిలో రాజకీయాలు ప్రభావితం చేయాలి అనుకుంటున్న కెసిఆర్.
కమ్యూనిస్ట్ లను ప్రతి రాష్ట్రం లోనూ వెంట బెట్టుకోవాలి అనుకుంటూ ఉన్నారు.

అందుకే ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ లో వాళ్ళకి కొన్ని సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది.ఇక్కడ ఎలాగూ కాంగ్రెస్ పార్టీ కి గడ్డు కాలం గడుస్తు ఉండటం తో.టీఆరెఎస్ పార్టీ తోనే కలిసి ఏడు అడుగులు వేయాలని ఫిక్స్ అయ్యారు.వాళ్ళ అధిష్టానం కూడా అదే వైఖరి తో ఉండటం తో.ఇప్పుడు వాళ్ళలో కొత్త జోష్ కనిపిస్తూ ఉంది.అందుకే ఖమ్మం జిల్లా సభకు ఏకంగా కేరళ సీఎం పినరయి విజయం ను ఆహ్వానించారు .

రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా లోనే కాకుండా.కమ్యూనిస్ట్ పార్టీ ల ప్రతి నిదిగా అయన హాజరు కానున్నారు.దాంతో ఈ సారికి కమ్యూనిస్ట్ లు టీఆరెఎస్ పార్టీ తో ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.
ఎలాగైనా కామునిస్ట్ లను తిరిగి చేర్చుకోవాలి అని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అదే ప్లాన్ లో ఉంది.
మరి ఎన్నికల రోజు నాటికి కమ్యూనిస్ట్ లు మనసు మార్చుకుంటారా.? లేక టీఆరెఎస్ పార్టీ తోనే నడుస్తారా చూడాలి.