కోనసీమ జిల్లా అమలాపురంలో కలెక్టర్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ట్రాక్టర్లతో వచ్చిన రైతుల కలెక్టరేట్ ను ముట్టడించారు.
ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ అన్నదాతలు నిరసనకు దిగారు.ఈ క్రమంలోనే అధికారులతో రైతులు వాగ్వివాదానికి దిగారు.
వెంటనే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.దీంతో పాటు కొన్న ధాన్యం డబ్బులను వారం రోజుల్లో జమ చేయాలని కోరారు.
ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు.ఈ నేపథ్యంలో తమ ధాన్యాన్ని కొనకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోయారు.