ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది.ఇటీవల ఏపీపీఎస్సీ అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ పరీక్షను ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలని పేర్కొంది.అయితే దీనిపై ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.కేంద్రం జారీ చేసే నోటిఫికేషన్లు హిందీలో కూడా ఉంటాయని చెప్పారు.
లాయర్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం నోటిఫికేషన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.