ఫ్యాటీ ఫుడ్స్ ను అధికంగా తీసుకోవడం, ఒత్తిడి, ఒకే చోట గంటల తరబడి కూర్చుని ఉండటం, మద్యపానం తదితర కారణాల వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోతే ఉంటుంది.దాంతో నాజూగ్గా ఉండాల్సిన పొట్ట లావుగా తయారవుతుంది.
ఫలితంగా బట్టలు పట్టకపోవడమే కాదు శరీర ఆకృతి సైతం అందవిహీనంగా తయారవుతుంది.దాంతో పొట్ట కొవ్వును కరిగించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే అస్సలు వర్రీ అవకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే పొట్ట కొవ్వు పది రోజుల్లో మాయం అవ్వడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.
ముందు ఒక నిమ్మ పండును తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక కీరా దోసకాయను తీసుకుని వాటర్లో కడిగి స్లైసెస్ మాదిరి కట్ చేయాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కీరా స్లైసెస్, నిమ్మ పండు ముక్కలు, గుప్పెడు పార్స్లీ ఆకులు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకుంటే మన ఫ్యాట్ కట్టర్ డ్రింక్ సిద్ధం అయినట్టే.
ఈ డ్రింక్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు నేరుగా సేవించాలి.ఈ డ్రింక్ ను రోజుకు ఒక గ్లాస్ చొప్పున ప్రతి రోజు తీసుకుంటే అందులో ఉండే ప్రత్యేక సుగుణాలు పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును వేగంగా కరిగిస్తుంది.బాన పొట్టను నాజూగ్గా మారుస్తుంది.
అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
మరియు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు సైతం బయటకు తొలగిపోతాయి.కాబట్టి తప్పకుండా ఈ సూపర్ పవర్ ఫుల్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.