వైద్యుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వైద్యుల‌కు శుభ‌వార్త చెబుతుంది.క‌రోనా స‌మ‌యంలో చేసిన కృషికి గాను సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణ‌యం తీసుకున్నట్లుగా వెల్లడించింది.

 Ak Singhal Says Ap Govt Increased Senior Doctors Stipend, Ap Govt, Staifund, Sen-TeluguStop.com

ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ మీడియా ముఖంగా తెలిపారు.ఇకపోతే సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ప్రస్తుతం వస్తున్న స్టైఫండ్ రూ.45 వేల నుంచి రూ.70 వేలకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణ‌యించిన‌ట్టు వెల్లడించారు.ఇక జూనియ‌ర్ డాక్ట‌ర్ల డిమాండ్ల పై కూడా చర్చలు సాగుతున్నాయని, త్వరలో ఏ నిర్ణయం అనేది వెల్లడిస్తామని తెలియచేశారు.కాగా ప్రస్తుతం కరోనా విధుల్లో సుమారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు తమ సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజాగా సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube