ప్రస్తుత పోటీ ప్రపంచంలో క్లాస్ ఫస్ట్ రావడమే కష్టం కాగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్( State First Rank ) సాధించాలంటే ఏ స్థాయిలో కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రేయింబవళ్లు కష్టపడి చదివినా తాము కోరుకున్న ర్యాంక్ రాలేదని చాలామంది చెబుతున్నారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది కన్న కలలను నెరవేర్చుకోవడం సాధ్యం కావడం లేదనే సంగతి తెలిసిందే.అయితే ఎడ్ సెట్ పరీక్షలో( Ed CET ) కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన యువతి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి వార్తల్లో నిలిచారు.
కారు డ్రైవర్ కూతురు అయిన ఆస్మా( Asma ) స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ను సొంతం చేసుకుని మట్టిలో మాణిక్యంగా ప్రశంసలు అందుకుంటున్నారు.బయోలాజికల్ సైన్స్ విభాగంలో 100కు 98 మార్కులు సాధించి వార్తల్లో నిలిచారు.
భవిష్యత్తులో టీచర్ గా స్థిరపడాలని ఆస్మా భావిస్తున్నారని సమాచారం అందుతోంది.ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో ఆస్మా చదివారని సమాచారం అందుతోంది.

ఆస్మా రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆస్మాకు ఆర్థికంగా సపోర్ట్ అందితే ఆమె కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టాలెంట్ ఉన్నవాళ్లకు తమ వంతు సహాయసహకారాలు అందిస్తే ఆమె కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధిస్తుందని చెప్పవచ్చు.

ఆస్మాకు చిన్నప్పటి నుండి చదువుపై ఎంతో ఆసక్తి ఉండేదని భోగట్టా.పది, ఇంటర్ లలో కూడా ఆస్మాకు మంచి మార్కులు వచ్చాయని సమాచారం.ఆస్మాకు మంచి మార్కులు రావడంతో కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తోంది.
ఆస్మా ఎంతోమంది స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.ఆస్మా రాబోయే రోజుల్లో అనుకున్న లక్ష్యాలను సాధించి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిద్దాం.