పాడిరైతులకు లబ్ది చేకూరేలా కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్.. !

ఏపీ సీఎం జగన్ పాడిరైతులకు లబ్ది చేకూరేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జగనన్న పాల వెల్లువ పథకానికి శ్రీకారం చుట్టారు.

ఇప్పటికే ఎన్నో పధకాలతో ప్రజల హృదయాల్లో నిలిచిన జగన్ తాను చేసిన పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు స్వయంగా చూశానని, అప్పుడే వారికి హమీ ఇచ్చానని తెలిపారు.అందుకే వీరికి లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.

ఇక పాడి రైతులకు ఇచ్చిన హామీ మేరకు అమూల్ ప్రాజెక్టును తీసుకొచ్చామని, ఇక నుండి పాలు పోసే అక్కచెల్లెమ్మలంతా అమూల్ సంస్థలో వాటాదారులేనని తెలిపారు.కాగా అమూల్ ప్రాజెక్టు ద్వారా పాడి రైతులకు లీటరుకు అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు వచ్చేలా చూస్తామని వెల్లడించారు.ఇక ఇప్పటికే ఈ పాల సేకరణ ప్రకాశం, కడప, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరుగుతోందని, నేటి నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని 153 గ్రామాల్లో అమూల్ సంస్థ పాల సేకరణ మొదలు పెట్టినట్లుగా తెలిపారు.

అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 9,899 గ్రామాలకుఈ ప్రాజెక్ట్ విస్తరిస్తామని పేర్కొన్నారు.

Advertisement
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

తాజా వార్తలు