అక్కడ ఎన్నికల ఫలితాలు.. ఇక్కడ అలెర్ట్ చేస్తున్న జగన్ 

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత,  ఏపీ సీఎం జగన్( CM Jagan ) ముందుగానే అలర్ట్ అవుతున్నారు ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.తెలంగాణతో పాటు జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించింది.

 Ap Cm Jagan Alert On Five States Assembly Elections Results Details, Ap Cm Jagan-TeluguStop.com

  గెలుపు ఉత్సాహంతో ఉన్న బిజెపి పార్లమెంట్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తుందనే అనుమానాలు జగన్ లో మొదలయ్యాయి.నిజంగా బిజెపి( BJP ) అదే నిర్ణయం తీసుకుంటే ఏపీలోనూ షెడ్యూల్ కంటే రెండు నెలలు ముందు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని జగన్ అంచనా వేస్తున్నారు .అందుకే ముందుగానే పార్టీ శ్రేణులను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఇక దూకుడుగా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.

ఈ మేరకు ఈనెల 11న ఏపీ మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనికోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజెండాను సిద్ధం చేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు సూచించారు.

ఈ మంత్రి వర్గ సమావేశంలో పాలనాపరంగా అనేక కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నారు.ముఖ్యంగా సంక్షేమ పథకాల్లో( Welfare Schemes ) కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పించడం , జనవరి ఒకటి నుంచి పెన్షన్ 3000 కి పెంచడం,  అలాగే ఏపీలో ఉద్యోగాల భర్తీపైన జగన్ ఫోకస్ చేయనున్నారు.

ఏపీపీఎస్సీ( APPSC ) ద్వారా కొత్త ఉద్యోగాల నియామకానికి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారట.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Janasena, Pawan Kalyan, Tdpjanasena,

అలాగే విశాఖ నుంచి పరిపాలనను మొదలుపెట్టెందుకు సమావేశంలో చర్చించనున్నరట.ఈ నెలలోనే జగన్ విశాఖకు( Vishakapatnam ) మకాం మార్చాలనే ఆలోచనతో ఉన్నారట.పరిపాలన పరంగా సంక్షేమ రంగానికి పెద్దపీట వేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

డీఎస్సీ పోస్టుల భర్తీ , ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలను చేపట్టబోతున్నారట.పార్లమెంట్ ఎన్నికలకు( Parliament Elections ) షెడ్యూల్ కంటే రెండు నెలలు ముందుగానే బిజెపి ఎన్నికలకు వెళ్లేందుకు ఆలోచన చేస్తుందని,  అదే జరిగితే ఏపీలోనూ ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయని జగన్ అంచనా వేస్తున్నారు.

అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు జగన్ సూచిస్తున్నారట.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Janasena, Pawan Kalyan, Tdpjanasena,

ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగనన్న సురక్ష , సామాజిక బస్సు యాత్ర ఆడుదాం ఆంధ్ర వంటి వాటిపైన జగన్ సమీక్ష చేయబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే టిడిపి జనసేన పొత్తులో( TDP Janasena ) భాగంగా ఏపీ అంతట విస్తృతంగా పర్యటనలు చేపట్టి భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకోవడం , చంద్రబాబు తో( Chandrababu Naidu ) కలిసి ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్న నేపథ్యంలో వైసిపి కూడా దూకుడుగా ముందుకు వెళ్లే విధంగా జగన్ మంత్రివర్గ సమావేశంలో ప్లాన్ చేయబోతున్నారట .అదే కాకుండా టిడిపి , జనసేన పొత్తుపై బిజెపి వైఖరి ఎలా ఉండబోతుందనే విషయం పైన జగన్ చర్చించబోతున్నారట.తుఫాను ప్రభావం,  పంట నష్టం బాధితులకు సహాయం వంటి అన్ని అంశాల పైన ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube