1.నిజామాబాద్ లో బర్డ్ ఫ్లూ
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యానం పల్లి లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది.
యానం పల్లి తండా సమీపంలో పౌల్ట్రీ ఫామ్ లో 200 కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ కారణం అయ్యి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
2.కిలో టమాట రూపాయి
కర్నూలు జిల్లా దేవనకొండ లో కిలో రూపాయి ధర పలకడంతో టమాటా రైతులు రోడ్లపై తమాటాలను పారబోసి వెళ్ళిపోయారు.
3.కెసిఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేస్తాం

బిజెపి కార్యకర్తలపై దాడులు ఆపకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.
4.రుణ యాప్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
అరుణ యాప్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.ముంబై కేంద్రంగా యాప్ నిర్వహిస్తున్న చైనా జాతీయుడు తో పాటు, భారత్ కు చెందిన మరో వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
5.మూడో రోజూ అఖిల ప్రియ కస్టడీ విచారణ

బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియ ను మూడోరోజు పోలీసులు విచారిస్తున్నారు.
6.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణలో 331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
7.’ ఆయుష్ ‘ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్ , బి ఎన్ వై సి సీట్ల భర్తీకి కాళోజి హెల్త్ యూనివర్సిటీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
8.ఆన్లైన్ ఆడిట్ లో తెలంగాణ నెంబర్ వన్
ఆన్లైన్ ఆడిట్ లో దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది.2019- 20 ఆడిట్ లో తెలంగాణ ఇప్పటి వరకు 40 ఆన్లైన్ ఆడిట్ నిర్వహించిందని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సేథీ అభినందించారు.
9.జనసేన సంక్రాంతి కానుక

సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ లోని పలు ప్రాంతాల్లో సంక్రాంతి కానుకను పంపిణీ చేశారు.కార్యక్రమంలో పార్టీ కి చెందిన కీలక నాయకులు పాల్గొన్నారు.
10.శ్రీ స్వామి హర్ష ఆనంద మహారాజ్ కన్నుమూత
బెంగుళూరు నగరంలోని రామకృష్ణ మఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద మహారాజ్ కన్నుమూసారు.
11.శరద్ పవార్ తో సోనూసూద్ భేటీ
ప్రముఖ సినీనటుడు రియల్ హీరో సోనూసూద్ బుధవారం ఎన్సిపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు.
12.ట్రంప్ కి యూట్యూబ్ షాక్

అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై అక్కడి టెక్ కంపెనీ లో వరుసగా జలక్ ఇస్తూనే ఉన్నాయి.తాజాగా ట్రంప్ కు చెందిన ఛానల్ పై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది.
13.ఊగండ లో సోషల్ మీడియా పై నిషేధం

ఉగాండాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు సోషల్ మీడియాపై ఆ దేశ ప్రభుత్వం మంగళవారం నుంచి నిషేధం విధించింది.
14.వ్యూహన్ కు డబ్ల్యూహెచ్ఓ బృందం
కరోనా వైరస్ మూలాలను కనుక్కునేందుకు చైనాలోని ఊహాన్ నగరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం రేపు పర్యటించనుంది.
15.వ్యవసాయ బావిలో చిరుత
తెలంగాణలోని రాజన్న సిరిసిల్లలో ఓ చిరు వ్యవసాయ బావిలో పడింది జిల్లాలోని బోయిన్ పల్లి మండలం మల్కా పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
16. ఫసల్ భీమా పై మోదీ వ్యాఖ్యలు
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం తో కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
17.కరోనా కొత్త రకం కేసులు

భారత్ లో కరోనా కొత్త రకం కేసుల సంఖ్య 102 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
18.ట్రంప్ తీరుతో రిపబ్లికన్ పార్టీ లో చీలిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ఆయన సొంత పార్టీ రిపబ్లికన్ లో చీలికలకు కారణం అవుతోంది.
19.అంతర్జాతీయ ప్రయాణికుల పై అమెరికా ఆంక్షలు
కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి ఉదృతం అవుతున్న నేపథ్యంలో ప్రయాణికుల పై ఆంక్షలు పొడిగించేందుకు అమెరికా సిద్ధమవుతోంది.
20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,460
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,460
.