పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు బుర్కాలో వెళ్లిన అనుపమ.. అలా విషయం లీక్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సామాన్య ప్రేక్షకులే కాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు కూడా ఆయనంటే ఎంతో అభిమానం చూపిస్తారు.ముఖ్యంగా హీరోయిన్లు మాత్రం ఆయన అంటే పడి చస్తారు.

 Anupama Went In A Burqa For Pawan Kalyan Bheemla Nayak Movie Details, Anupama P-TeluguStop.com

ఈయన సినిమా విడుదలైంది అంటే చాలు మొదటి రోజే థియేటర్లో సందడి చేస్తుంటారు.ఇంకా హీరోయిన్స్ మాత్రం ముసుగు వేషంలో వెళ్లి మరి సినిమాలు చూస్తుంటారు.

అలా తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాకు మరో బ్యూటీ అనుపమ కూడా బుర్కాలో వెళ్లిందట.

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటి నాచురల్ కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి అందరికి తెలిసిందే.

తన అందంతో, నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.తెలుగు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది.అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.

ఆ తర్వాత నితిన్ నటించిన ‘అఆ’ సినిమాతో నాగవల్లి పాత్రలో బాగా ఆకట్టుకుంది.ఇక ఆ తర్వాత ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉండడమే కాకుండా అల్లరి పిల్లగా కూడా ఓ పేరు తెచ్చుకుంది.నిత్యం ఏదో ఒక ఫోటోను, ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేస్తుంది.

Telugu Pages, Anupama Burqa, Bhimla Nayak, Karthikeya, Pawan Kalyan, Telugu, Tol

ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ప్రతి రోజు ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తుంటుంది.అంతేకాకుండా ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ప్రతి రోజు ఏదోక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.

చాలావరకు ఇన్స్టా రీల్స్ తో భలే సందడి చేస్తుంది ఈ కేరళ కుట్టి.అంతేకాకుండా తన సోదరుడితో ఆడుకుంటున్న వీడియోలను, అల్లరి చేస్తున్న వీడియోలను పంచుకుంటూ బాగా లైకులు, కామెంట్ లు పొందుతూ ఉంటుంది.

నాచురల్ గా కనిపిస్తూ అందర్నీ తన వైపు మలుపుకుంది.ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమట.

Telugu Pages, Anupama Burqa, Bhimla Nayak, Karthikeya, Pawan Kalyan, Telugu, Tol

ఇక ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమాకు ఆ సినిమా విడుదలైన రోజే మొదటీ షో కు బుర్కా వేసుకొని వెళ్లిందట.తాజాగా ఈ విషయం తానే బయట పెట్టగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.ఇక ఈ ముద్దుగుమ్మ సినిమా విషయానికి వస్తే.ప్రస్తుతం తాను 18 పేజెస్ సినిమాలో హీరో నిఖిల్ సరసన నటిస్తోంది.అంతేకాకుండా కార్తికేయ2 తో పాటు పలు సినిమాలలో వరుస అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తోంది.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా బాగా అవకాశాలు అందుకుంటోంది.

ఇక ఈ సినిమాలతో ఎటువంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube