చంద్రబాబు, పవన్ కల్యాణ్( Chandrababu , Pawan Kalyan ) పై మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాజకీయ డ్రామాలను చూసి ప్రజలు విసిగిపోయారని తెలిపారు.
తాజాగా మరో కొత్త డ్రామాను తెరపైకి తెచ్చారని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.నాలుగున్నరేళ్లుగా రాజానగరం, రాజోలు టీడీపీకి ఇంఛార్జులే లేరని చెప్పారు.
ఆ రెండు నియోజకవర్గాలను చంద్రబాబు జనసేనకే వదిలేశారని తెలిపారు.
తనపై పార్టీ నేతలు, జనసైనికుల్లో వస్తున్న వ్యతిరేకతను చల్లార్చేందుకేనని చెప్పారు. పవన్ కల్యాణ్ అభ్యర్థుల ప్రకటన డ్రామా అని తెలిపారు.వైజాగ్, తిరుపతి, విజయవాడ, కాకినాడ వంటి ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులను( Jana sena ) పవన్ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా అని వెల్లడించారు.