టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలకు కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.
దాదాపు ఒక క్రికెట్ టీం కి ఉన్నంత మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.అయితే తాజాగా మరో హీరో కూడా మెగా ఫ్యామిలీ( Mega Family ) నుంచి ఇండస్ట్రీకి రాబోతున్నారని తెలుస్తోంది.మరి ఆయన ఎవరు ఏ సినిమా ద్వారా రాబోతున్నారు అనే విషయానికి వస్తే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే .అల్లు అర్జున్( Allu Arjun ) కజిన్ (బావమరిది) విరాన్ ముత్తం శెట్టి (Viran Muttham Shetty) హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.ఈయన ముఖ్య గమనిక ( Mukhya Gamanika ) అనే సినిమా ద్వారా త్వరలోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తోంది.క్రిస్మస్ పండుగను పరిష్కరించుకొని ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ బాబి ( Director Bobby )ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పలు విజయవంతమైన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన వేణు మురళిధర్.వి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ ఎప్పుడు అల్లు అర్జున్ గారిని కలవడానికి వెళ్లిన అక్కడ మమ్మల్ని విరాన్ ఎంతో సాదరంగా ఆహ్వానించే వారిని తెలిపారు.
అయితే అప్పుడు నాకు ఈయన అల్లు అర్జున్ కి బంధువు అనే విషయం అసలు తెలియదని అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోకి బంధువు అయినప్పటికీ ఏమాత్రం వారి స్టేటస్ ఉపయోగించకుండా సొంతంగా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలని భావిస్తున్నాడని ఈ సందర్భంగా బాబి విరాన్ గురించి తెలియజేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా ఫ్యామిలీలో ఇంకా ఎంతమంది హీరోలు ఉన్నారు.
ఇండస్ట్రీ మొత్తం మీరే ఏలేస్తారా ఇతరులకు ఛాన్స్ ఇవ్వరా అంటూ మరికొందరు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.