బిగ్ బాస్ షో సీజన్3 రన్నర్ గా నిలిచిన శ్రీముఖి ఆ తర్వాత కొంతకాలం పాటు పరిమితంగా టీవీ షోలు చేశారనే సంగతి తెలిసిందే.అయితే శ్రీముఖి మళ్లీ యాంకర్ గా బిజీ అవుతున్నారు.
ఈటీవీ ప్లస్ ఛానల్ లో జాతిరత్నాలు అనే షో ద్వారా శ్రీముఖి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కాగా రాత్రి 9 గంటలకు ఈ షోను ప్రసారం చేయనున్నారని సమాచారం అందుతోంది.
ఇంద్రజ ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.పోసాని కృష్ణమురళి ఈ షోకు గెస్ట్ గా హాజరై స్టాండప్ కామెడీ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ప్రముఖ నటుడు, రైటర్ అయిన్ కృష్ణ భగవాన్ చాలా రోజుల తర్వాత ఈ షోలో కనిపించి సందడి చేశారు.శ్రీముఖి ఈ మధ్య కాలంలో ఏమైనా రాశారా అని అడగగా మాదాపూర్ లో మా అపార్టుమెంట్ పై “ఇది అద్దెకు ఇవ్వబడును” అని రాశానని కృష్ణభగవాన్ చెప్పుకొచ్చారు.
ఇంద్రజ ఏం చేస్తే మీరు ఇరిటేట్ అవుతారని కృష్ణ భగవాన్ ను అడగగా మీరు పదే పదే ఇదే ప్రశ్న అడిగితే ఇరిటేట్ అవుతానని కృష్ణ భగవాన్ వెల్లడించారు.
ఆ తర్వాత షోలోకి అన్నపూర్ణమ్మ ఎంట్రీ ఇచ్చి శ్రీముఖిపై తనదైన శైలిలో పంచ్ లు వేశారు.శ్రీముఖికి టీవీలో అందరూ రాములమ్మా రాములమ్మా అంటారని తెలుసని టీవీ ముందు కూర్చున్న వాళ్లు రావద్దమ్మా రావద్దమ్మా అని అనడం మాత్రం తెలియదని అన్నపూర్ణమ్మ పంచ్ లు వేశారు.
అన్నపూర్ణమ్మ వేసిన పంచ్ విని యాంకర్ శ్రీముఖి ముఖం మాడ్చుకున్నారు.ఆ తర్వాత అన్నపూర్ణమ్మ శ్రీముఖితో ఆర్ఆర్ఆర్ మూవీలో అడిగారా అని ప్రశ్నించగా అడగలేదు అని శ్రీముఖి సమాధానం ఇచ్చారు.అదేంటి నువ్వు మాట్లాడితేనే ఆర్ఆర్ వేసినట్టు ఉంటుంది కదా ఆర్ఆర్ఆర్ వాళ్లు నిన్ను పిలవక పోవడం ఏమిటంటూ అన్నపూర్ణమ్మ సెటైర్లు వేశారు.
శ్రీముఖిపై అన్నపూర్ణమ్మ వేసిన పంచ్ లు భలే పేలాయి.